హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కలయికలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఆగిపోయిందనే వార్తల ఫై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో భారీ విజయం సాధించి ఏపీ ఉప ముఖ్యమంత్రి తో పాటు పలు శాఖలకు మంత్రిగా బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలో ఈయన సినిమాలు చేస్తారా లేదా అనేది సందేహం గా మారింది. రీసెంట్ గా ఓ మీటింగ్ లో పవన్ సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు.
మూడు నెలల తర్వాత షూటింగ్ లలో జాయిన్ అవుతా..ఈ మేరకు నిర్మాతలకు తెలిపినట్లు చెప్పుకొచ్చారు. అయితే పవన్ OG మూవీ ని మాత్రం పూర్తి చేస్తారని, మిగతా సినిమాలు చేయండంటూ అంత మాట్లాడుకుంటున్నారు. అందులో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఇప్పటికే ఆగిపోయిందని సోషల్ మీడియా లో ప్రచారం అవుతుండడం తో దీనిపై హరీష్ క్లారిటీ ఇచ్చాడు. సినిమా స్టార్ట్ అవ్వదు అన్నపుడే రూమర్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు రూమర్స్ చదివే టైం కూడా లేదు అంటూ అసలు ఆ రూమర్స్ నే కొట్టి పారేసాడు. దీనితో అసలు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాగా జస్ట్ పవన్ ఇచ్చే సమయం కోసం మేకర్స్ చూస్తున్నారు. ఇది సెట్ అయితే మళ్ళీ ఉస్తాద్ ఆన్ ట్రాక్ లో ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం హరీష్ మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నాడు.