రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అభిమానులు కిక్. పక్కా కమర్షియల్ మసాలా ఎంటర్టైనర్ అని భావిస్తుంటారు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ను కూడా అలాగే ఉహించుకుంటున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, భాగ్యశ్రీ బోర్సే, సచిన్ ఖేడేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే నెల 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈ క్రమ్మలో చిత్ర ప్రమోషన్ లో హరీష్ సినిమా గురించి , రవితేజ గురించి తెలుపుతూ సినిమా ఫై మరింత ఆసక్తి నింపుతున్నారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ..రవితేజ అభిమానిగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా తీశానని .. ప్రేక్షకులు నా సినిమా నుంచి ఆశించే అంశాలు అన్నీ ‘మిస్టర్ బచ్చన్’లో ఉంటాయి. హండ్రెడ్ పర్సెంట్ పక్కా అది! ఓ అభిమానిగా గత నాలుగైదు సినిమాల నుంచి ఒరిజినల్ రవితేజను మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉంది నాలో! ఈ సినిమాలో ఆ ఒరిజినల్ రవితేజను చూస్తారు. ఆయన నుంచి ప్రేక్షకులు ఏయే అంశాలు ఆశిస్తారో అవన్నీ ఉంటాయి” అని హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘వెల్లువొచ్చి గోదారమ్మ’ సాంగ్ రీమిక్స్ చేశారు హరీష్ శంకర్. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో ‘గువ్వా గోరింకా’తో రీమిక్స్ చేశారు. ‘మిస్టర్ బచ్చన్’ బ్యాక్ డ్రాప్ 85 నుంచి 90 వరకు ఉండటంతో పాత సినిమాల సాంగ్స్ చాలా వినిపిస్తాయని, అందుకే ఈ సినిమాలో రీమిక్స్ చేయలేదని హరీష్ శంకర్ తెలిపారు.