Friday, November 22, 2024
Homeతెలుగు వార్తలుమొద‌టి సినిమాలోనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించ‌డం గ‌ర్వంగా ఉంది - 22హీరో రూపేష్...

మొద‌టి సినిమాలోనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించ‌డం గ‌ర్వంగా ఉంది – 22హీరో రూపేష్ కుమార్ చౌద‌రి.

- Advertisement -

22 ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. ఈ నెంబ‌ర్ అనేది ఈ సినిమాలో మేజ‌ర్ పాయంట్‌. స్టోరీలైన్ ఇప్పుడే రివీల్ చేయ‌లేను కాని ఈ సినిమా డెఫినెట్‌గా ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడికి ఒక కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌నిస్తుంది. అని అన్నారు హీరో రూపేష్ కుమార్ చౌద‌రి. ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న చిత్రం 22. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి సుశీలా దేవి నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. స‌లోని మిశ్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆగ‌స్ట్2 హీరో రూపేష్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా రూపేష్ కుమార్ చౌద‌రి ఇంట‌ర్వ్యూ..

మీ నేపథ్యం..?

  • మాది బిజినెస్‌ ఫ్యామిలీ. నేను కూడా మా నాన్నగారికి సపోర్ట్‌గా ఉండి బిజినెస్‌ చూసుకునేవాడిని. అయితే నాకు చిన్న‌ప్ప‌టినుండి యాక్టింగ్ అంటే ఇంట్ర‌స్ట్ ఉంది కాని ఇండ‌స్ట్రీలోకి రాగ‌ల‌మా యాక్టింట్ చేయ‌గ‌ల‌మా అని ఒక సందేహం కూడా ఉండేది. మ‌న‌కు ఇష్ట‌మైన పని చేయ‌డంలోనే ఒక థ్రిల్ ఉంటుంది. అందుకే మా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ని క‌న్వీన్స్ చేసి ఈ రంగంలోకి రావ‌డం జ‌రిగింది. ఇక్క‌డకు రాక‌ముందు చాలా భ‌యాలు ఉండేవి. కాని ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇష్ట‌మైన ప‌ని కావ‌డంతో వ‌ర్క్ శాటిస్‌ఫ్యాక్ష‌న్ ల‌భించింది.

ద‌ర్శ‌కుడు శివ‌తో మీ జ‌ర్నీ ఎలా స్టార్ట్ అయింది?

  • నాకు శివ‌ను ఆనీ మాస్ట‌ర్ ప‌రిచ‌యం చేశారు. మేమిద్ద‌రం క‌లిసి ఒక వెబ్‌సిరీస్ చేశాం. ఆ త‌రువాత 22 క‌థ విన్నాను. క‌థ వింటున్న‌ప్పుడే ఎగ్జ‌యిట్ అయ్యాను. ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర అన‌గానే లోప‌ల ఆనందం వేసినా మెద‌టిసినిమాలోనే ఇంత ఇంటెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్ చేయ‌గ‌ల‌నా? అని భ‌యం కూడా క‌లిగింది. అయితే మొద‌టి సినిమాలోనే ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్ చేయ‌డం గ‌ర్వంగా ఉంది.

ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమైనా శిక్షణ తీసుకున్నారా?

  • ఈ క్యారెక్ట‌ర్ కోసం న‌న్ను నేను పూర్తిగా ట్రాన్స్‌ఫామ్ చేసు‌కున్నాను. కుల‌దీప్ సేటీ అనే సెల‌బ్రిటీ ట్రైన‌ర్ స‌హాయంతో ఆరు నెల‌లు జిమ్ చేసి బాడీ బిల్డ్ చేశాను. అలాగే ‘ఖైది నంబర్‌ 150’, ‘బాహుబలి’, ‘సాహో’ వంటి చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌ చేసిన జాషువా మాస్టర్ మా సినిమాలో అత్యద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ కంపోజ్ చేశారు. ఆ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం ఆయ‌న ద‌గ్గ‌రే కుంగ్‌ఫూ, మార్షల్‌ ఆర్ట్స్ లాంటి వాటిలో శిక్షణ తీసుకున్నాను.

పోలీస్ ఆఫీస‌ర్‌గా మిమ్మ‌ల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవ‌డం ఎలా అనిపించింది?

  • ఆ అనుభ‌వం గురించి చెప్ప‌డానికి నాకు మాట‌లు రావ‌డంలేదు. అంత గొప్ప అనుభూతి. అయితే ఒక్క‌టి మాత్రం ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. చిన్న‌ప్ప‌టి నుండి నేను పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్ చేస్తే ఎలా ఉంటుంది అని నేను ఊహించుకున్నానో ‌దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ‌గా స్క్రీన్ మీద కనిపించాను. ఇప్ప‌టికీ ఒక్కోసారి ఆ క్యారెక్ట‌ర్ చేసింది నేనేనా అనిపిస్తుంటుంది. ఆ క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాననే అనుకుంటున్నాను.

ఆ పాత్ర చేయ‌డానికి ఎవ‌రినైనా ఇన్‌స్పిరేషన్ గా తీసుకున్నారా?

  • సాదార‌ణంగానే నాకు పోలీసులంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్‌ చేస్తున్నప్పుడు పోలీసులంటే ఇష్టంతో పాటు గౌర‌వం కూడా పెరిగింది. ‘టెంపర్‌’ మూవీలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌,‌ అలాగే పవర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌‌ ‘గబ్బర్‌సింగ్‌’తో పాటు మ‌రికొంత మంది రియ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్టర్స్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని న‌టించాను.

ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమాకు లేనంత సెల‌బ్రిటీ స‌పోర్ట్ ఈ సినిమాకు ల‌భించింది క‌దా ఎలా అన్పిస్తోంది?

  • శివ నేను ఇద్ద‌రం ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. దానికి తోడు నా అభిమాన హీరో వెంక‌టేష్ గారి చేతుల‌మీదుగా నా సినిమా ప్రారంభం అవుతుంద‌ని నేను క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. అలాగే ఆ వేడుకకి హీరో సాయితేజ్‌తో పాటు ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు వచ్చి మా యూనిట్‌కి బ్లెస్సింగ్స్‌ ఇవ్వడం, వి.వి. వినాయ‌క్‌, సి. క‌ల్యాన్ గారు టైటిట్‌, బ్యాన‌ర్‌లోగోల‌ను ఆవిష్క‌రించ‌డం నిజంగా హ్యాపీగా అనిపించింది. అలాగే పూరీజ‌గ‌న్నాథ్ గారు, మారుతిగారు, నాగార్జున గారు, ప్ర‌భాస్ గారు మా సినిమా టీజ‌ర్, పాట‌లు విడుద‌ల‌చేసి మాకు స‌పోర్ట్ చేయ‌డం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నాను. అలాగే బి.ఎ రాజు గారి వ‌ల్లే ఈ సినిమాకు అంత హైప్ వ‌చ్చింది ఆయ‌న‌కు నా ప్ర‌త్యేక ద‌న్య‌వాదాలు.

22 సినిమా ఎలా ఉండ‌బోతుంది?

  • ఇది ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. 22 నెంబ‌ర్ అనేది ఈ సినిమాలో మేజ‌ర్ పాయంట్‌. స్టోరీలైన్ ఇప్పుడే రివీల్ చేయ‌లేను కాని ఒక్క‌టి మాత్రం ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను డెఫినెట్‌గా ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడికి ఒక కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌నిస్తుంది.

ఆడియో గురించి?

  • ఆడియో ఆదిత్య మ్యూజిక్‌ వాళ్లు చేశారు. ఈ సినిమాలో మూడు పాట‌లు ఉన్నాయి. మ‌ద‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో ఒక పాట ఉంటుంది. ఆ సాంగ్ ఎవ‌రు రాస్తే బాగుంటుంది అనుకున్న‌ప్పుడు భాస్క‌ర‌బ‌ట్ల గారు అయితే రైట్ చాయిస్ అనుకున్నాం. ఆయ‌న‌కు సిచ్యువేష‌న్‌ చెప్ప‌గానే చాలా బాగుంది సాహిత్యానికి మంచి అవ‌కాశం ఉంది అని వెంట‌నే ఆ పాట రాశారు. మిగ‌తా రెండు పాట‌ల్ని కాస‌ర్ల శ్యామ్ రాశారు అవి కూడా చాలా బాగా వ‌చ్చాయి. ఇద్ద‌రు సీనియ‌ర్ లిరిసిస్ట్ లు నా మూవీలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. అలానే మూడు పాట‌ల్ని సాయి కార్తిక్ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. ముఖ్యంగా సాయి కార్తిక్ హై వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలెట్ అవుతుంది.

మిగ‌తా టెక్నీషియ‌న్స్ గురించి?

  • సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి కిర‌ణ్ కి ముంబైలో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. త‌న లైటింగ్ టెక్నాల‌జీతో సినిమాకి బాలీవుడ్ రేంజ్ క్వాలిటీని ఇవ్వ‌గ‌లిగారు. మా సినిమాకి ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే మా ఎడిట‌ర్ శ్యామ్ ఏరోజు కారోజు ఎడిటింగ్ చేయ‌డం వ‌ల్ల నాకు డైరెక్ట‌ర్ కి డైలీ ఒక క్లారిటీ ఉండేది. అది పోస్ట్ ప్రొడక్ష‌న్ వ‌ర్స్క్‌ స్పీడ‌ప్ అవ‌డానికి బాగా హెల్ప్ అయింది. అలాగే మూవీలో ఉన్న సాంగ్స్ అన్నీ ఆనీ మాస్ట‌ర్ గారే కొరియోగ్ర‌ఫి చేశారు. ప్ర‌తి సాంగ్‌కి ముందు నా ఎక్స్్‌ప్రెష‌న్స్ మ‌రియు బాడీ లాంగ్వేజ్ మీద వ‌ర్క్ చేసి నాకు కొన్ని సింపుల్ టెక్నిక్స్, ఇన్‌పుట్స్ ఇవ్వ‌డం వ‌ల్ల నాకు సాంగ్స్ షూట్ అప్పుడు ఈజీ అయింది. మా క‌థ‌కు త‌గ్గ‌ట్లు రిక్వైర్‌మెంట్స్‌ని అర్ధం చేసుకుని క్వాలిటీలో ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా మేము అనుకున్న దానిక‌న్నా ముందే సెట్స్ రెడీ చేసి షూటింగ్‌కి ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌కుండా చూసుకున్నారు ఆర్ట్ డైరెక్ట‌ర్ పెద్దిరాజు అడ్డాల గారు. కో-డైరెక్ట‌ర్ పుల్లారావు కొప్ప‌నీడు గారు వి.వి. వినాయ‌క్ గారి ద‌గ్గ‌ర వ‌ర్క్ చేశారు. ఆయ‌న‌కు మా సినిమా క‌థ న‌చ్చి వ‌ర్క్ చేయ‌డానికి ఒప్పుకున్నారు. ఆయ‌న చేసిన లొకేష‌న్స్‌, షెడ్యూల్ ప్లానింగ్ వ‌ల్ల సినిమాని టైమ్‌కి ఫినిష్ చేయ‌గ‌లిగాం. అంతే కాకుండా సీనియ‌ర్ సౌండ్ మిక్సింగ్ టెక్నీషియ‌న్ ఇ. రాధాకృష్ణ గారు సినిమా చూశాక డెఫినేట్‌గా హిట్ కొడుతున్నారు అని మా టీమ్ అంద‌రినీ అప్రిషియేట్ చేశారు. ఇంత మంచి సినిమాకి డాల్బీ అట్మాస్ లాంటి సౌండ్ ఉంటే థియేట‌ర్‌లో ఆడియ‌న్స్‌కి బాగా రీచ్ అయ్యి సినిమాకి ప్ల‌స్ అవుతుంద‌ని చెప్ప‌డంతో 22 సినిమా డీటిఎస్‌ని డాల్బీ అట్మాస్‌ గా క‌న్వ‌ర్ట్ చేశాం. వీరితో పాటు నేను డైరెక్ట‌ర్ ప్లాన్ చేసిన క‌ల‌ర్ థీమ్స్ ని బాగా అర్ధం చేస‌కుని పోస్ట‌ర్స్ డిజైన్ చేసిన డిజైన‌ర్ ఫ‌ణికి థాంక్స్‌.

డైరెక్ట‌ర్ శివ కుమార్ మేకింగ్ గురించి?

  • శివకి ఇది మొద‌టిసినిమా అయినా ఒక ఎక్స్‌పీరియ‌న్స్‌డ్ డైరెక్ట‌ర్ లా ఒక క్లారిటీతో సినిమా తీశారు. నేను శివ అన్ని విష‌యాలు ముందే డిస్క‌ర్స్ చేసుకోవ‌డంతో మేకింగ్, క్వాలిటీలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా లావీష్‌గా సినిమా తీశారు. అలాగే క‌థ చెప్పిన విధానం, సినిమా తీసిన విధానం న‌న్ను బాగా ఇంప్రెస్ చేసింది. దీంతో పాటు నా పెర్ఫామెన్స్ అండ్‌ డైలాగ్ డెలివ‌రీ, హెయిర్, మేక‌ప్, కాస్ట్యూమ్స్ మీద స్పెష‌ల్ కేర్ తీసుకుని న‌న్ను స్క్రీన్ మీద ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ రుద్ర‌గా ప్ర‌జెంట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

టీజ‌ర్‌, సాంగ్ రిలీజ్‌ అయ్యియి క‌దా రెస్పాన్స్ ఎలా ఉంది?

  • టీజ‌ర్ అలాగే మార్ మార్ కె జీనా హై సాంగ్ ని విడుద‌ల చేశాం. వాటికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ లాక్‌డౌన్‌లో చాలా మంది ఫోన్ చేసి సినిమా విడుద‌ల కోసం చాలా క్యూరియ‌స్ గాఎదురుచూస్తున్నాం అని చెప్పారు. సినిమాపై హైప్‌ క్రియేట్ అవ‌డంతో మంచి బిజినెస్ ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్నాయి. అలాగే ఓటిటి, హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కోసం కూడా అప్రోచ్‌ అవుతున్నారు. అయితే ఇది ఒక బిగ్‌స్క్రీన్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అందుకే థియేట‌ర్ రిలీజ్‌కే ప్రిప‌రెన్స్ ఇచ్చి ఈ కోవిడ్- 19 వ్యాప్తి త‌గ్గి తిరిగి థియేట‌ర్స్ ఓపెన్ చేయ‌గానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం.

హీరోయిన్‌, మిగతా ఆర్టిస్ట్‌ల గురించి?

  • ‘ఫలక్‌నుమాదాస్‌’ చిత్రంలో జోయా పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సలోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెది కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్న సీబిఐ ఆఫిస‌ర్ క్యారెక్ట‌ర్. నాతో పాటు కొన్ని యాక్ష‌న్ సీన్స్‌లో న‌టించింది. ఈ సినిమాలో మా ఇద్ద‌రి క్యార‌క్ట‌రైజేష‌న్స్ అండ్ పిక్చ‌రైజేష‌న్ స్టైల్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్స్‌గా నిలుస్తాయి. అలాగే జయప్రకాష్‌, రాజేశ్వరి నాయర్‌, ఫిదా శ‌ర‌ణ్య‌, పూజ రామచంద్రన్‌, రవివర్మ, దేవి ప్ర‌సాద్‌ ఇలా మంచి పేరున్న ఆర్టిస్ట్‌లు, సీనియ‌ర్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమా కోసం పని చేశారు.
    విల‌న్‌గా ఒక బాలీవుడ్ న‌టుడిని తీసుకోవ‌డానికి కార‌ణం ఏంటి?
  • ఈ సినిమాలో విల‌న్ క్యారెక్ట‌ర్ ఎవ‌రు చేస్తే బాగుంటుంది అని మా టీమ్ అంద‌రం డిస్క‌స్ చేసుకుంటున్న‌ప్పుడు నాకు హార్ట్‌ ఎటాక్‌` సినిమాలో విల‌న్‌గా న‌టించిన‌ బాలీవుడ్ న‌టుడు
    ‌విక్రమ్‌జిత్ విర్క్ అయితే ఈ క్యారెక్ట‌ర్ కి బాగుంటుంది అనిపించి ఆయ‌న‌ను సంప్ర‌దించాం. ఆయ‌న‌కు క్యారెక్ట‌ర్ బాగా న‌చ్చ‌డంతో మెయిన్ విలన్‌గా న‌టించారు. అది సినిమాకి మంచి బ‌జ్ క్రియేట్ చేసింది.

టెక్నిక‌ల్‌గా సినిమా ఎలా ఉండ‌బోతుంది?

  • రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, సైరా, విజిల్‌ లాంటి పెద్ద పెద్ద సినిమాల‌కు విజువ‌ల్ ఎఫెక్ట్స్ అందించిన మ్యాన్‌ట్రిక్ స్టూడియోస్ ప్రై.లి ఈ సినిమాకు వ‌ర్క్ చేయ‌డం జ‌రిగింది. అది కూడా మా సినిమాకు మంచి ప్ల‌స్ అయింది.

ఫ్రెండ్‌షిప్ డే రోజే మీ బ‌ర్త్‌డే వ‌చ్చింది క‌దా..మీ స్నేహితుల‌ గురించి?

  • నాకు చిన్న‌ప్ప‌టినుండి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే బిజినెస్ ప‌రంగా కూడా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఇప్పుడు శివ‌తో పాటు 22 సినిమా యూనిట్ అంద‌రూ కూడా నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వారంద‌రికీ ఫ్రెండ్‌షిప్‌డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు హీరో రూపేష్ కుమార్ చౌద‌రి.
- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read