Movie News

తండ్రి పోస్ట్ కొట్టేసిన బిగ్ బాస్ ఫేమ్

బిగ్ బాస్ సీజన్ 06 ఫేమ్ మానస్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు. బిగ్ బాస్ ముందు వరకు కూడా మానస్ పెద్దగా చాలామందికి తెలియదు..బిగ్ బాస్ తర్వాత తనకంటూ అభిమానులను, గుర్తింపు ను పెంచుకున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మానస్ తాజాగా తన భార్య శ్రీజ ప్రస్తుతం గర్భిణీ అనే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినప్పటికీ తమ మనసులు పర్ఫెక్ట్ గా కలిసాయి అంటూ, ఇప్పుడు తమ కుటుంబంలోకి ఓ బుజ్జాయి రాబోతున్నందుకు సంతోషంగా ఉంది అని అందులో పేర్కొన్నారు.

బేబీ నాగులపల్లి వచ్చేస్తున్నాడు అంటూ తన భార్య శ్రీజ బేబి బంప్ తో ఉన్న పిక్ ను షేర్ చేశాడు. ఇక సమాచారం ప్రకారం శ్రీజ శ్రీమంతం వారం రోజుల క్రితమే ఘనంగా జరిగింది. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ప్రస్తుతం తాను తండ్రి కాబోతున్నాను అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన మానస్ కు నెటిజన్లు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.