Tuesday, December 24, 2024
HomeMovie News'రాజు యాదవ్' ఫస్ట్ లుక్ టీజర్

‘రాజు యాదవ్’ ఫస్ట్ లుక్ టీజర్

- Advertisement -

జబర్దస్త్ షో తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న గెటప్ శ్రీను..వెండితెరపై కూడా రాణిస్తున్నాడు. ఓ పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతూనే తాజాగా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. డైరెక్టర్ కృష్ణమాచారి తెరకెక్కించిన ‘రాజు యాదవ్’ సినిమాలో శ్రీను హీరోగా పరిచయం కానున్నాడు. యధార్థ సంఘటనల ఆధారంగా కృష్ణమాచారి ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో అంకిత కారత్ హీరోయిన్​గా నటించగా..ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఆదివారం విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు.

ఈ సినిమాలో శ్రీను మధ్య తరగతి కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడు. క్రికెట్ ఆడుతుండగా బంతి శ్రీను మొహంపై తగులుతుంది. దీంతో అతడి ముఖ చిత్రం కామెడీగా మారిపోతుంది. ఈ ఒక్క లైన్​తో డెరెక్టర్ సినిమాను నడిపించారు. ఈ రకమైన ఫేస్​తో శ్రీను పడే ఇబ్బందులు ట్రైలర్​లో చూపించారు. ఇక ఈ సినిమాలో రాకెట్ రాఘవ, జబర్దస్త్ ఫేమ్ సన్నీ, హేమంత్, ఆనంద చక్రపాణి తదితరులు నటించారు. ఇక ఈ మూవీ మే 17న థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read