విశ్వక్ సేన్, నేహా శెట్టి , అంజలి జంటగా కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఓటిటి లోకి వచ్చేసింది. మే 31 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం నెల కూడా గడవకు ముందే కేవలం 15 రోజులకే ఓటీటీ (OTT)కి వచ్చేసి సర్‌ఫ్రైజ్ చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ‘నెట్‍ఫ్లిక్స్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
మంచి హైప్‍తో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి సూపర్ ఓపెనింగ్ దక్కింది. తొలి రోజే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.8.2 కోట్లతో దుమ్మురేపింది. గామి తర్వాత విశ్వక్‍కు ఇదే భారీ ఓపెనింగ్ అయింది. అయితే, కాస్త మిశ్రమ స్పందన రావటంతో ఆ తర్వాత వసూళ్లు కాస్త డ్రాప్ అయ్యాయి. మొత్తంగా సుమారు రూ.25కోట్ల కలెక్షన్లను రాబట్టి ఈ బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫార్మెన్సే చేసిందని అంచనాలు ఉన్నాయి.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో లంకల రత్నాకర్ అలియాజ్ టైగర్ రత్న పాత్రలో విశ్వక్‍సేన్ యాక్షన్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‍గా నటించారు. అంజలి ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. నాజర్, సాయికుమార్, గోపరాజు రమణ, మధుసూధన్, హైపర్ ఆది, పృథ్విరాజ్ కీలకపాత్రల్లో కనిపించారు. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో లోకల్ పాలిటిక్స్‌తో ఈ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.