Movie News

సెప్టెంబర్ 27 న ‘గేమ్ చేంజర్’..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ..టాప్ డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే సినిమా తాలూకా అప్డేట్స్ , పిక్స్ , సాంగ్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తిని పెంచేసాయి. కానీ అభిమానుల ఎదురుచూపులు మాత్రం తెరపడడంలేదు. పలుమార్లు మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. 2021 లోనే సినిమా ను స్టార్ట్ చేసిన మేకర్స్..2023 లో సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకరావాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అనేక అవాంతరాలు ఎదురు అవడం, షూటింగ్ కు సైతం పలు బ్రేక్స్ రావడం తో సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది.

మొన్నటి వరకు డిసెంబర్ లో రిలీజ్ కాబోతుందని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 27 న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు తెలుస్తుంది.దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని అంటున్నారు. వాస్తవానికి అదే రోజున పవన్ కల్యాణ్ ‘OG’ రిలీజ్ ప్లాన్ చేశారు. అప్పటికి ఈ చిత్రం వచ్చే అవకాశం లేకపోవడం వల్లే ‘గేమ్ చేంజర్’ రిలీజ్ అవుతుందని అంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీ లో చరణ్ కు జోడిగా కియారా నటిస్తుండగా.. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.