Movie News

‘ఘాటి’ జూలై 11న థియేట్రికల్ రిలీజ్

క్వీన్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, UV క్రియేషన్స్ ప్రజెంట్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఘాటి’ జూలై 11న థియేట్రికల్ రిలీజ్

క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’ గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. దీని తర్వాత, తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ఇంటెన్స్ అవతార్ లో కనిపించిన  క్యారెక్టర్ గ్లింప్‌ను మేకర్స్ విడుదల చేశారు.  ఇది సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచింది. ఘాటిని UV క్రియేషన్స్ సమర్పిస్తుంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తారు.

ఈరోజు, మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఘాటి జూలై 11న రిలీజ్ కానుంది. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయనున్నారు. రిలీజ్ డేట్  పోస్టర్‌లో అనుష్క, విక్రమ్ ప్రభు నది గుండా సంచులు మోసుకుంటూ వెళుతున్న విజువల్స్ ఇంటెన్స్ జర్నీని సూచిస్తున్నాయి.

‘ఘాటి’ అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్‌ సక్సెస్ ఫుల్ మూవీ ‘వేదం’తర్వాత కలిసిన చేస్తున్న  హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. అనుష్క, UV క్రియేషన్స్‌తో నాలుగోసారి కలిసి వర్క్ చేయడం మరో విశేషం.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి ఎడిటర్. సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. ఈ చిత్రం హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది.

ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.