Friday, October 18, 2024
HomeMovie News‘మా’ సభ్యులకు ఉచిత కంటి పరీక్ష..

‘మా’ సభ్యులకు ఉచిత కంటి పరీక్ష..

- Advertisement -

గురువారం ‘మా’ సభ్యులకు ఉచిత కంటి పరీక్ష ను శంకర ఐ హాస్పిటల్స్‌, ఫినిక్స్‌ ఫౌండేషన్‌ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు విష్ణు మంచు, వైస్‌ ప్రెసిడెంట్‌ మాదాల రవి, ట్రెజరర్‌ శివ బాలాజీ పాల్గొన్నారు. ఈ ఫ్రీ ఐ హెల్త్‌ క్యాంప్‌లో మా సభ్యులందరూ పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.

ఈ సందర్బంగా విష్ణు మాట్లాడుతూ.. ‘హెల్త్ క్యాంప్ నిర్వహించిన శంకర ఐ హాస్పిటల్స్, ఫినిక్స్ ఫౌండేషన్‌లకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గోని సద్వినియోగం చేసుకుని విజయవంతం చేసిన మా సభ్యులకు అభినందనలు. పద్మశ్రీ డా. రమణి గారు గురించి మేం విన్నాం. భారతదేశం అంతా కూడా ఫ్రీగా ఐ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదని అంటుంటారు. ఫీనిక్స్ సంస్థ, శంకర హాస్పిటల్స్ కూడా అదే చేస్తోంది. కంచి కామ కోటి మఠ పీఠాదిపతుల్ని మేం ఆరాధిస్తుంటాం. వాళ్ల ఆశీస్సులతో ఈ హాస్పిటల్స్ నడుస్తుండటం ఆనందంగా ఉంది ’ అని తెలిపారు.

అలాగే శివ బాలాజి మాట్లాడుతూ.. ‘అందరూ కంటి సమస్యల గురించి పట్టించుకోరు. ఇలా మా సభ్యులందరికీ ఫ్రీ ఐ హెల్త్ చెకప్ చేయించడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు 25 లక్షల మందికి ఫ్రీ ఆపరేషన్స్ చేయించారని తెలిసింది. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మేం అంతా కలిసి మీకు ఫ్రీగా ప్రచారం చేస్తామ’ని అన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read