Movie News

ఫస్ట్ టైం శోభిత – చైతు ఓపెన్ అయ్యారు

టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల వివాహం ఇటీవల అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ప్రేమలో మునిగిఉన్న ఈ జంట ఈ మధ్యనే కుటుంబ సభ్యుల సమక్షంలో ఒకట్టారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రేమకథను పంచుకున్నారు. 2018లో శోభిత తొలిసారి నాగార్జున ఇంటికి వెళ్లగా, 2022లో నాగచైతన్యతో స్నేహం ఏర్పడిందని, ఈ జంట తమ పరిచయం, స్నేహం, ప్రేమా సంబంధాలు గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

శోభిత 2022 ఏప్రిల్ నుండి నాగచైతన్యను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నానని తెలిపారు. వారు ఎప్పుడూ కలిసినా, ముఖ్యంగా ఫుడ్ గురించి మాట్లాడుకోవడం అలవాటుగా మారింది. ఆమె మాట్లాడుతూ.. “చైతన్య తరచూ నన్ను తెలుగులో మాట్లాడమని అడిగేవారు. అది మా బంధాన్ని మరింత బలపరచింది” అన్నారు.

మొదటిసారి ముంబైలోని ఓ కేఫ్‌లో కలుసుకున్నట్లు శోభిత తెలిపింది. తను నాకోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవాడి. ఆ రోజున నేను రెడ్ డ్రెస్‌లో, చైతన్య బ్లూ సూట్‌లో ఉన్నామని అని ఆమె గుర్తుచేశారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి కర్ణాటకలోని ఒక పార్కులో సమయం గడిపినట్లు పేర్కొంది.

శోభిత, నాగచైతన్య పెళ్లి ప్రపోజల్ గురించి మాట్లాడుతూ.. “గోవాలో ఈ ఏడాది పెళ్లి ప్రపోజల్ వచ్చింది” అని చెప్పారు. నాగచైతన్య ఈ సందర్భంలో మాట్లాడుతూ.. “సినీ ఇండస్ట్రీలో ఇతర భాషల వక్తలను కలిసినప్పుడు, నాకు తెలుగులో మాట్లాడేవారితో మరింత కనెక్ట్ అవుతాను” అన్నారు.