Tuesday, December 24, 2024
HomeMovie News‘ కల్కి’ మూవీ ఫస్ట్ టికెట్ ను బిగ్ బి ఇంతకు కొనుగోలు చేసాడంటే..!!

‘ కల్కి’ మూవీ ఫస్ట్ టికెట్ ను బిగ్ బి ఇంతకు కొనుగోలు చేసాడంటే..!!

- Advertisement -

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD) సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపించడం ఖాయమని అంత భావిస్తున్నారు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. జూన్ 27 పాన్ ఇండియా పలు భాషల్లో విడుదల కాబోతుండడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు జోరు పెంచారు.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో దీపికా పదుకొనేతో పాటు ప్రభాస్, అమితాబ్, రానా , కమల్ హాసన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈవెంట్‌లో ప్రభాస్ చాలా తక్కువగా మాట్లాడారు. అతడిపై దీపికా పదుకోణ్‌తో పాటు అమితాబ్‌, రానా సెటైర్స్ వేస్తూ ఈ ఈవెంట్‌లో కనిపించారు.. ఈ సినిమా కోసం డైరెక్టర్ బాగా కష్టపడ్డారని అశ్విన్ పై యూనిట్ మొత్తం ప్రశంసలు కురిపించారు. కల్కి మొదటి టికెట్‌ను నిర్మాత అశ్వనీదత్ నుంచి బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ 500 రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ ఫస్ట్ టికెట్‌ను కమల్‌హాసన్‌కు అమితాబ్ బచ్చన్ గిఫ్ట్‌గా ఇచ్చారు.. టికెట్ ను తీసుకున్న బిగ్ బి నిర్మాత కాళ్లు మొక్కాడు.. ఆ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక ఆ తర్వాత కల్కి ఫస్ట్ టికెట్‌ను అమితాబ్ నుంచి తీసుకున్న కమల్‌హాసన్ ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read