Friday, October 18, 2024
HomeMovie Newsకల్కి లో ఆ హీరో కనిపించకపోయేసరికి ఫ్యాన్స్ డిస్పాయింట్

కల్కి లో ఆ హీరో కనిపించకపోయేసరికి ఫ్యాన్స్ డిస్పాయింట్

- Advertisement -

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 AD తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, రాజమౌళి , వర్మ వంటి వారు కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా ప్రమోషన్ లలో ఎక్కడ కూడా వీరు ఉన్నానే విషయాన్నీ తెలుపలేదు. కానీ తెలిపిన ఓ హీరో మాత్రం కనిపించకపోయేసరికి ఫ్యాన్స్ డిస్పాయింట్ అయ్యారు.

నాని కల్కి గురించి స్పెషల్ ట్వీట్ చేయడంతో ఈ సినిమాలో నాని పాత్ర పక్కా అని ఫిక్స్ అయిపోయారు. థియేటర్లలో సినిమా మొత్తం చూసినప్పటికీ ఎక్కడా నాని పాత్ర కనిపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. నేచురల్ స్టార్ కచ్చితంగా ఏదో ఒక కీ రోల్ పోషించి ఉంటాడని ఊహించిన నాని ఫ్యాన్స్ కి ఇది ఒక షాక్ అని చెప్పొచ్చు. దీంతో కల్కి 2898 మూవీలో నాని పాత్రను డిలీట్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నాగ్ అశ్విన్ ను ట్యాగ్ చేస్తూ నాని కల్కిలో సినిమాలో ఎందుకు లేడు? అని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read