Movie News

దర్శకుడిపై అసహనం వ్యక్తం చేసిన ప్రముఖ హీరోయిన్..

సన్నీ దేవోల్, అమీషా పటేల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన “గదర్ 2” బాక్సాఫీస్‌ దగ్గర ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనిల్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు అనిల్‌ శర్మ ఈ సినిమా మొదలు వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంలో అత్త పాత్ర చేయడంపై అమీషా పటేల్‌ వెనకడుగు వేసినట్లు అనిల్‌ శర్మ పేర్కొన్నారు. “అత్త పాత్ర కోసం ఆమెను నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించాం. గుర్తించదగిన తారలు చిన్న వయసులోనే ఇటువంటి పాత్రలు చేశారు. కానీ, ఆమె ఈ పాత్ర చేయడానికి నిరాకరించారు” అని అనిల్‌ చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ వ్యాఖ్యలపై అమీషా పటేల్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ స్పష్టమైన ప్రతిస్పందన ఇచ్చారు. “గౌరవనీయ అనిల్‌ గారూ, ఇది కేవలం సినిమా. రియల్‌ లైఫ్‌ ఫ్యామిలీ వ్యవహారాలు కాదు. అత్త పాత్రలు చేయాలా, చేయకూడదా అన్నది నా వ్యక్తిగత నిర్ణయం. నేను ఎప్పుడూ అత్త పాత్రలు చేయను. అది నా ప్రిన్సిపల్” అని అమీషా తన అభిప్రాయం వెల్లడించారు. “ఈ నిర్ణయానికి రూ.100 కోట్ల ఆఫర్ వచ్చినా నేను మారను. నా అభిప్రాయాన్ని గౌరవించాలని నేను కోరుతున్నాను. గదర్‌ చిత్రంతో అనుభవం గొప్పదే అయినా, ఇలాంటి పాత్రలను నేను ఎప్పుడూ చేయలేను” అని పేర్కొన్నారు.