News

ఏపీలో మరోసారి ఆ పార్టీదేనా విజయం..? కేంద్రం లో కూడా అదేనా..?

దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబదించిన ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాదించబోతున్నారు..? ఏ అభ్యర్ధికి అత్యధిక మెజార్టీ రాబోతుంది..? ముఖ్యంగా ఏపీలో ఏ పార్టీ గెలవబోతుందనే ఆసక్తికి మరికొద్ది గంటల్లో తెరపడనుంది. అంతకంటే ముందు ఎగ్జిట్ పోల్స్ వచ్చి..ఆయా పార్టీలలో సంతోషం , నిరాశ నింపుతున్నాయి. మెజార్టీ పోల్స్ కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి రాబోతుందని తేల్చి చెప్పాయి.

ఇక Universaltalkies సర్వే ప్రకారం..కేంద్రంలో 276 నుండి 377 స్థానాల మధ్య బిజెపి సాదించబోతుందని తేల్చింది. ఇక ఇండియా కూటమి 77 నుండి 139 స్థానాల వరకు దక్కించుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరోసారి రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీకి పట్టం కట్టేందుకు డిసైడ్ అయ్యారని ధీమా వ్యక్తం చేసింది. అసెంబ్లీ బరిలో వైసీపీ 108 నుండి 111 స్థానాలు దక్కించుబోతుందని అంచనా వేసింది. ఇక కూటమి పార్టీ 64 నుండి 67 మధ్య స్థానాలు దక్కించుకొని ఛాన్స్ ఉందని పేర్కొంది.

ఇక లోక్ సభ విషయానికి వస్తే..వైసీపీ 13 నుండి 14 సాదించబోతుందని , కూటమి 10 నుండి 12 మధ్య సాదించబోతుందని పేర్కొంది. అయితే పలు సంస్థలు మాత్రం కూటమికే విజయ అవకాశాలు ఎక్కువ అని చెప్పగా..లోకల్ సంస్థలు మాత్రం వైసీపీ పార్టీ విజయం సాదించబోతుందని తేల్చాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే బిజెపి 7 నుండి 9 లోక్ సభ స్థానాలు సాదించబోతుందని , కాంగ్రెస్ పార్టీ 6 నుండి 08 సాదించబోతుందని , ఎంఐఎం -1, బిఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాదించలేకపోతున్నాయని Universaltalkies పేర్కొంది. చూద్దాం ఏంజరుగుతుందో..ఎవరి సర్వే నిజం అవుతుందో..ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో..ఏ పార్టీ ప్రతిపక్ష హోదాలో కుర్చుంటుందో..!!