Movie News

జపాన్‌లో ముందుగానే ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23. అయితే గత కొంత కాలంగా హీరోల పుట్టినరోజులకు వారికి సంబంధించిన పాత చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. అలా ఈ సారి కూడా డార్లింగ్ బర్త్​ డేకు కూడా ప్రభాస్ పాత్ర సినిమాలను మళ్లీ విడుదల చేయనున్నారు. కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటె..జపాన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ సినిమాని రీ రిలీజ్ చేసి ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ని అడ్వాన్స్ గా జరుపుకున్నారు. హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అని పెద్ద బ్యానర్స్, ప్రభాస్ ఫొటోలతో హడావిడి చేసారు. దీంతో జపాన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన సందడి వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మెడిలో వైరల్ గా మారాయి.