Tuesday, December 24, 2024
HomeMovie News'డబుల్ ఇస్మార్ట్' క్రేజీ అప్డేట్

‘డబుల్ ఇస్మార్ట్’ క్రేజీ అప్డేట్

- Advertisement -

రామ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది ఇస్మార్ట్ శంకర్ అనే చెప్పాలి. పూరి డైరెక్షన్లో నాభ నటేష్ , నిధి అగర్వాల్ జంటగా 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.ఈ చిత్రానికి రామ్ యాక్టింగ్ , పూరి డైరెక్షన్ , మణిశర్మ మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ విజయం తర్వాత వెంటనే పార్ట్ 2 తెరకెక్కిస్తారని అనుకున్నారు కానీ కుదరలేదు. ఈ మూవీ తర్వాత రామ్ చేసిన సినిమాలన్నీ ప్లాప్స్ అయ్యాయి.

ఈ తరుణంలో కొద్దీ నెలల క్రితం ఇస్మార్ట్ 2 అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపారు. ఆ తరువాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. అయితే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా అభిమానుల్లో జోష్ నింపారు. సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నట్లు చేస్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్​)లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. ‘మరో షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. పలు కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్​లో షూట్ చేయనున్నాం’ అని పూరీ ట్వీట్ చేసాడు. ముంబయిలో జరగనున్న ఈ షెడ్యూల్​లో స్టార్ యాక్టర్లంతా పాల్గొనబోతున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read