Movie News

అమెజాన్ లో ‘డబుల్ ఇస్మార్ట్’ ..

డబుల్ ఇస్మార్ట్ ఓటిటి రైట్స్ ను అమెజాన్ దక్కించుకుంది. రామ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది ఇస్మార్ట్ శంకర్ అనే చెప్పాలి. పూరి డైరెక్షన్లో నాభ నటేష్ , నిధి అగర్వాల్ జంటగా 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.ఈ చిత్రానికి రామ్ యాక్టింగ్ , పూరి డైరెక్షన్ , మణిశర్మ మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఈ విజయం తర్వాత వెంటనే పార్ట్ 2 తెరకెక్కిస్తారని అనుకున్నారు కానీ కుదరలేదు. ఈ మూవీ తర్వాత రామ్ చేసిన సినిమాలన్నీ ప్లాప్స్ అయ్యాయి. ఈ తరుణంలో కొద్దీ నెలల క్రితం ఇస్మార్ట్ 2 అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపారు. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ఓటిటి రైట్స్ ను అమెజాన్
రూ.33 కోట్లకు దక్కించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాత ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు.