Movie News

ఇంతవరకు ఒక్క బోల్డ్ సీన్ లో కూడా నటించని హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఈరోజుల్లో హీరోయిన్లకు సినిమాల్లో రాణించాలంటే అందంగా ఉండటం ఒక్కటే కాదు.. అందాలను కూడా ఆరబోస్తేనే అవకాశాలు వస్తాయి.. ఈ మధ్య వస్తున్న సినిమాలు అన్ని కూడా గ్లామర్ ను కూడా ఎక్కువగా చూపిస్తారు.. హీరోయిన్ అందాల ఎక్కువగా ఆరబోస్తున్న సినిమాలనే యూత్ ఆదరిస్తున్నారు.. అయితే ఓ హీరోయిన్ మాత్రం కేరీర్ ను మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడా ఎక్స్పోజ్ చెయ్యలేదు.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా?

ఈ హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.. అవును మీరు ఊహించిందే నిజం.. ఆమె సీనియర్ హీరోయిన్ మీనా.. ఈమె 90 లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కోలివుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్, టాలీవుడ్ టాప్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. దృశ్యం సినిమాతో సినీ ఇండస్ట్రీలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి మరోసారి తన నటనతో ఆకట్టుకుంటోంది.. అయితే ఇప్పటివరకు ఈమె ఒక్క సినిమాలో కూడా బోల్డ్ పాత్రలో కనిపించలేదు.. అందుకు కారణం కూడా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.. తన తండ్రికి ఇచ్చిన మాట వల్లే ఆమె ఆ సీన్స్ కు నో చెప్పినట్లు చెప్పింది.

1982లో వచ్చిన తమిళ్ సినిమా ‘నెంజంగల్’లో నటించింది. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘ఎంకెయో కెట్టా కురల్’, ‘అన్బుల్లా’ వంటి తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది.. నవయుగం, ఎన్ రసవిన్ మనసిలే, సాంత్వనం, రాజేశ్వరి కళ్యాణం, చంటి, వీర, ముత్తు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది… కేరీర్ పీక్స్ లో ఉన్నా కూడా బోల్డ్స్ సీన్స్ చెయ్యనని తేల్చి చెప్పేసింది.. ఇటీవల తన భర్త విద్యాసాగర్ అనారోగ్యం కారణంగా చనిపోయారు.. ప్రస్తుతం మీనా వరుస సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది.