Movie News

‘గేమ్ చేంజర్’ ట్రైలర్ లో ప్రతీ షాట్ అద్భుతంగా అనిపించింది…ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజమౌళి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ విడుదలైంది. ఈ కార్యక్రమంలో దర్శకధీరుడు రాజమౌళి, ఇతర చిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ, “శంకర్ గారి చిత్రం ప్రతి షాట్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా వింటేజ్ శంకర్‌ను మరోసారి గుర్తు చేస్తుంది. రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లను హోరెత్తించేస్తుంది” అని ప్రశంసించారు.

దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, “ఇది ఒక సామాజిక, మాస్ ఎంటర్టైనర్. రామ్ చరణ్ పాత్రల్లో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది” అన్నారు.

నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్, ఇతర నటీనటులు ఎస్‌జే సూర్య, అంజలి, కియారా అద్వాని, సముద్రఖని, శ్రీకాంత్ సినిమాపై తమ అనుభూతులను పంచుకున్నారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన, తమన్ సంగీతం, శంకర్ దర్శకత్వం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.జనవరి 10న సినిమా విడుదలకానుండగా,ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ సినిమా పైన ఆంచనాలు ప్రేక్షకుల మరింత పెరిగాయి