న్యూ టాలెంట్‌ను ఎంకరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే మెగా మనస్సున్న హీరో మెగాస్టార్ చిరంజీవి అభినందనలు అందుకున్నాడు అప్‌కమింగ్ దర్శకుడు దినేష్ మహేంద్ర. వివరాల్లోకి వెళితే. తెలుగులో పలు సూపర్‌హిట్ చిత్రాలతో దర్శకుడిగా అందరి హృదయాల్లో మంచి గుర్తింపు సంపాందించుకున్న దర్శకుడు ఎన్.శంకర్. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, భద్రాచలం, జయం మనదేరా, జై భోలో తెలంగాణ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్ విజయాలుగా నమోదు అయ్యాయి. ఇప్పుడు శంకర్ వారసుడు దినేష్ మహేంద్ర త్వరలోనే మెగాపోన్ పట్టనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆశ్శీస్సులు తీసుకోవడానికి దినేష్ మహేంద్ర మెగాస్టార్ చిరంజీవిని ఆయన స్వగృహంలో కలుసుకున్నారు. ఈ సందర్బంగా తన దర్శకత్వంలో రాబోతున్న “ఫీల్ గుడ్ లవ్ స్టోరీ” మొదటి మూవీ డీటెయిల్స్ మెగాస్టార్ కి వివరించారు దినేష్. * సినిమా కథను అడిగి తెలుసుకున్న చిరంజీవి … బ్రీఫ్ గా కథ విన్నాక చిన్న వయసులో అద్భుతమైన కథతో వస్తున్నావ్ అంటూ దినేష్ కి అభినందనలు తెలిపడంతో పాటు * సినిమా బడ్జెట్ తో పాటు హీరో హీరోయిన్ పాత్రధారుల డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు మెగాస్టార్. సినిమాను కూడా ఖచ్చితంగా చూడటంతో పాటు సినీ రంగంలో నీ లాంటి యువ ప్రతిభా దర్శకులకు తన ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. సినిమా రంగంలో దర్శకుడిగా తండ్రికి మించిన తనయుడిగా దినేష్ మహేంద్ర ఎదగాలని ఆకాంక్షించారు మెగాస్టార్.