యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇది బియోపిక్ అనుకోవచ్చా ?
-లేదండీ. వాస్తవిక సంఘటనలతో కూడుకున్న కాల్పనిక ప్రేమకథ. ఇందులో ఇన్సిడెంట్ వాస్తవం. మత్య్సలేశ్యం నుంచి గుజరాత్ వెళ్ళడం అక్కడ నుంచి పాక్ సరిహద్దుల్లో దొరకడం, వారి కోసం పోరాటం.. ఇదంతా వాస్తవం. దానికి ఒక అందమైన ప్రేమకథ అల్లాం. అందుకే రియల్ పేర్లు పెట్టలేదు.
తండేల్ లో చైతు గారి ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా వుండేది ?
-ఇందులో ప్రతి షాట్ నా బ్రెయిన్ లో వుంది. ప్రతిది ఓ కొలమానం లోనే చేశాను. పెళ్లి కార్డ్ సీన్ లో కేవలం అతనికి మాత్రమే తెలిసేలా కళ్ళని చూపించాం. అక్కడ నుంచి ప్రతి షాట్ డిజైన్ చేశాం. ఆ సీన్ కి థియేటర్ మొత్తం ఊగిపోయింది.


మీ డైరెక్షన్ లో నాగచైతన్య గారి ఫస్ట్ వందకోట్ల సినిమా ఇవ్వడం ఎలా అనిపిస్తుంది ?
-ఇది గీతా ఆర్ట్స్. అరవింద్ గారు, వాసు గారు, చైతు గారు, దేవిశ్రీ .. ఇలా అంతా కలసి చేసిన కొలాబరేట్ ఎఫర్ట్. నా అక్షర రూపానికి వారంతా విజువల్ ని ఇచ్చారు. చైతు గారికి నేను అంటే చాలా ఇష్టం. మా మధ్య చాలా మంచి స్నేహం వుంది.
నాగార్జున గారు ఈ సక్సెస్ ని చాలా ఎంజాయ్ చేయడం ఎలా అనిపించింది ?
-నాగార్జున గారు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూశారు. ఆయన ‘థాంక్ యూ చందు. వి లవ్ యూ’అని చెప్పడం ఆయన గొప్పదనం. అది నాకు గొప్ప ప్రశంస. ఈ సినిమా ఒక గౌరవం తీసుకొస్తుందని ముందు నుంచి నమ్మాం. ప్రేక్షకులు అంతే గౌరవంతో గొప్ప ఘన విజయాన్ని ఇచ్భారు.
సినిమా పైరసీ బారిన పడినప్పుడు ఎలా ఫీలయ్యారు ?
-గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది. ఆ బాధ మాటల్లో చెప్పలేను. సినిమాని ఒక థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసమే తీస్తాం. అలాంటిది పైరసీ బారిన పడటం చాలా బాధాకరం. మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపొయినంత బాధగా ఉటుంది. చాలా పెయిన్ ఫుల్.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ?
కార్తికేయ3 వుటుంది. మధ్యలో ఓ సినిమా వుంది. సూర్య గారితో చర్చలు జరుగుతున్నాయి. అది వర్క్ అవుట్ అవుతుందని ఆశిస్తున్నాను.