Movie News

విడుదలైన మూడు వారాలకే OTT లోకి వచ్చేసిన దిల్ రాజు మూవీ

ఇటీవల OTT లకు సినీ ప్రేక్షకుల ఆదరణ బాగా పెరిగింది. థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడడం చాలామంది తగ్గించేశారు. ఏదో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో రెండు , మూడు రోజులు థియేటర్స్ సందడి గా కనిపిస్తున్నాయి తప్పితే మిగతా రోజులన్నీ ఈగలు కొట్టుకోవాల్సిందే. దీంతో OTT సంస్థలు భారీ ధర పెట్టి సినిమాల ott రైట్స్ దక్కించుకొని..విడుదలైన మూడు వారాలకే OTT లో ప్రసారం చేస్తున్నారు. దిల్‌రాజు వార‌సుడు ఆశీష్ హీరోగా న‌టించిన ల‌వ్ మూవీ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా ఈ మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చి ఆడియెన్స్‌ను అమెజాన్ ప్రైమ్ స‌ర్‌ప్రైజ్ చేసింది.

మే 25న ఈ హార‌ర్ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజైంది. థియేట‌ర్ల‌లో ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. సినిమా కాన్సెప్ట్ బాగుంద‌నే టాక్ వ‌చ్చినా హార‌ర్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం, క‌థ‌లో క‌న్ఫ్యూజ‌న్ ఎక్కువ కావ‌డంతో ల‌వ్ మీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ల‌వ్ మీ మూవీలో ఆశీష్ స‌ర‌స‌న‌ వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా న‌టించింది. ర‌వికృష్ణ‌, సిమ్రాన్ చౌద‌రి కీల‌క పాత్ర‌లు పోషించారు. అరుణ్ భీమవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హించ‌గా దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్ రెడ్డి , హ‌న్షితా రెడ్డి , నాగ మ‌ల్లిడి నిర్మించారు. ఎంఎం కీరవాణి, పీసీ శ్రీరామ్ లాంటి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేశారు.