తెలుగు సినిమా ప్రముఖ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSFDC) చైర్మన్ శ్రీ దిల్ రాజు గారు, నిర్మాత హర్షిత్ రెడ్డి గారు ఇటీవల ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ బృందంలో డిప్యూటీ కాన్సుల్ జనరల్ స్టీవెన్ కానోలీ, వైస్ కాన్సుల్ హారియట్ వైట్, స్టెఫీ చెరియన్ ఉన్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా సినిమా సహనిర్మాణాలు (Co-Productions), సాంస్కృతిక కార్యక్రమాలు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల మారకము (Talent Exchange) వంటి అనేక కీలక అంశాలపై చర్చ జరిగింది.
ఆస్ట్రేలియా ప్రతినిధులు, ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంపై, అలాగే తెలుగు సినిమా రంగంపై చాలా ఆసక్తి చూపించారు. తెలుగు సినిమా ప్రగతిని పరిగణలోకి తీసుకుని, భవిష్యత్తులో ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాలకు మరిన్ని అవకాశాలు కల్పించేలా ఈ చర్చలు దోహదపడతాయని ఇరు పక్షాలూ విశ్వాసం వ్యక్తం చేశాయి.
ఈ భేటీ ద్వారా భారత-ఆస్ట్రేలియా సృజనాత్మక రంగాల మధ్య బంధం మరింత బలపడనుందని, తెలుగు సినిమాకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.