Friday, October 18, 2024
HomeMovie Newsహాలీవుడ్ లోకి ధనుష్..

హాలీవుడ్ లోకి ధనుష్..

- Advertisement -

కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్..సార్ మూవీ తో తెలుగు లోను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన హాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ అవెంజర్స్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కళ్లు చెదిరే గ్రాఫిక్స్, వేరే ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లేలా వుండే విజువల్ ఎఫెక్ట్ కారణంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అవెంజర్స్ సినిమాలను తెగ ఇష్టపడుతుంటారు. రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన అవెంజర్స్ చిత్రాల్లో ఇప్పటి వరకూ రిలీజ్ అయిన ప్రతి సిరీస్ స్ట్రెయిట్ ఇండియన్ సినిమాలతో పోటీ పడి మరీ వసూళ్లు సాధించింది.

రస్సో బ్రదర్స్ చివరగా విడుదల చేసిన ‘అవెంజర్స్ : ది ఎండ్ గేమ్’ చిత్రం ఇక అవెంజర్స్ కథ ముగిసింది అన్నట్లుగా ఉంటుంది. దీంతో అవెంజర్స్ సిరీస్ ఇక ఉండవనీ అంతా అనుకున్నారు. మార్వెల్ ఫ్యాన్స్ ఎంతో నిరాశ పడుతున్న సమయంలో జూలై 2024లో మళ్లీ ఆశ్చర్చకరమైన కబురు తెలిపారు రస్సో బ్రదర్స్. మార్వెల్ ప్రపంచానికి ప్రజలను మళ్లీ తీసుకెళతానంటూ ఆశలు రేకెత్తించే ప్రకటన చేశారు. అవెంజర్స్ కథ ఇంకా ముగిసిపోలేదనీ, త్వరలోనే మరో రెండు సిరీస్ రాబోతున్నామని వారు వెల్లడించారు. ‘అవెంజర్స్: డూమ్స్ డే’ పేరుతో ఒకటి, ‘అవెంజర్స్ సీక్రెట్ వార్స్’ అంటూ మరొకటి 2026, 2027 సంవత్సరాల్లో వరుసగా విడుదల కాబోతున్నట్లు మార్వెల్ స్టూడియోస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించనున్నారట. అంతే కాదు ధనుష్ ఈ సిరీస్​లో భాగం కానున్నారనే వార్తలు ప్రస్తుతం బాగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ చూడాలి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read