Monday, December 23, 2024
HomeMovie Newsదేవర నుండి బిగ్ అప్డేట్

దేవర నుండి బిగ్ అప్డేట్

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ తాలూకా బిగ్ అప్డేట్ వచ్చింది. సినిమాలోని కీలక షెడ్యూల్ ను తాజాగా పూర్తి చేసారు. దీంతో 90 శాతం షూటింగ్ పూర్తైందట. ఇంకా రెండు పాటలు, చిన్న టాకీ పార్ట్ మాత్రమే బ్యాలెన్స్​ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా మరో 10 రోజుల్లో పూర్తైయ్యే ఛాన్స్ ఉందని ఇన్​సైడ్ టాక్.

ఇక శంషాబాద్ ఏరియాలో ఓ పాట కోసం ప్రత్యేక సెట్ వేశారు. ఈరోజు (జూలై 10) నుంచి ఈ పాట షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడం వల్ల మిగిలిన 10 శాతం పనులు చకచకా పూర్తి చేసి ప్రమోషన్స్​పై దృష్టి పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమా ఎన్టీఆర్, యువసుధ బ్యానర్లపై కల్యాణ్ రామ్​ నిర్మిస్తున్నారు. ఇక రెండు పార్ట్​లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తొలి భాగం సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read