Friday, October 18, 2024
HomeMovie News‘దేవర’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది

‘దేవర’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది

- Advertisement -

‘దేవర’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27 రాబోతుంది.ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్ తో దేవర సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క టైటిల్ సాంగ్ మాత్రమే రిలీజయింది. ఇప్పుడు తాజాగా సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను ఆగ‌ష్టు 05న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా తార‌క్, జాన్వీల‌ది రొమాంటిక్ పోస్ట‌ర్ ఒక‌టి వ‌దిలారు. కాగా.. తంగం అంత‌రంగం అంటూ ఈ పాట ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఎన్టీఆర్, జాన్వీ ల మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ గా ఇది ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. మొదటిసారి ఎన్టీఆర్, జాన్వీ జోడీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఇందులో బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీతో పాటు హిందీలో వార్ 2 చిత్రంలో కూడా NTR నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న ఈ మూవీలో తారక్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అలాగే దేవర తర్వాత కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read