Movie News

DevakiNandanaVasudeva: అభిమానుల కోలాహలం నడుమ గల్లా అశోక్ సక్సెస్ టూర్

గతవారం మూడు మిడ్ రేంజ్ హీరోల సినిమాలు థియేటర్స్ లోవిడుదలయ్యాయి. వేటికవే సెపరేట్ జోనర్స్ లో తెరకెక్కాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ విభిన్న కథాంశంగా, మాస్ యాక్షన్ నేపంథ్యంతో వచ్చిన ఈ సినిమా రిలీజ్ రోజు డీసెంట్ టాక్ తెచ్చుకుంది. గల్లా అశోక్ ‘హీరో’ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో చాలా పరిణితి చెందాడు, ఎమోషన్స్ బాగా పలికించాడు, స్కీన్ పై అందంగా కనిపించాడు అనే మాట ఆడియన్స లో వినిపించింది

ఇదిలా ఉండగా డే -1 అంతంత మాత్రంగానే ఉన్న ఈ సినిమా కలెక్షన్స్ రెండవ రోజు కాస్త పుంజుకోగా మూడవ రోజు మరింత ఎక్కువ రాబట్టాయి. ప్రమోషన్స్ లో మెుదట నెమ్మదించిన మేకర్స్, కలెక్షన్స్ ఊపందుకోవడంతో సివిమాను మరింతగా ఆడియన్స్ లోకి తీసుకువెళ్ళేందుకు ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ముఖ్యంగా బీ,సీ సెంటర్స్ లో దేవకీ నందంన వాసుదేవ వీకెండ్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఇక వర్కింగ్ డేస్ లోనూ డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. కమర్షియల్ సినిమా కి డివోషనల్ టచ్ ఇవ్వడం భారీ యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి..ఈ నెపధ్యంలో హీరో గల్లా అశోక్ తెలుగురాష్ట్రాల్లో సక్సెస్ టూర్ చేపట్టాడు. అందులో భాగంగా థియేటర్స్ విజిట్ చేస్తున్నాడు. ఆ ఊరు ఈ ఊరు అని తేడా లేకుండా ఈ సక్సెస్ టూర్ లో గల్లా అశోక్ కు ప్రేక్షకులు బ్రమ్మరథం పడుతున్నారు. ఈ వారం మరే ఇతర సినిమాలు లేకపోవడంతో దేవకి నందన మరింత కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.