నటనా సార్వబౌమ.. శ్రీ కైకాల సత్యనారాయణ గారు మన మధ్య లేకపోవటం ఎంతో దురదృష్టకరం. అయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని
ఆ దేవుడ్ని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
ఇట్లు
జయ ప్రకాష్
చిత్రాఅంజలి సినీ వార పత్రిక
‘కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి స్నేహ సంబంధాలు వున్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితంలోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’
-నందమూరి బాలకృష్ణ
సీనియర్ నటులు.. నవరస నటనా సార్వబౌమ.. శ్రీ కైకాల సత్యనారాయణ గారి మరణం.. చిత్ర పరిశ్రమకు తీరని లోటు. కళామతల్లికి ఎంతో సేవ చేసి.. రాజకీయంగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆ దేవుడ్ని కోరుకుంటూ..
వై. కాశీ విశ్వనాధ్
ప్రెసిడెంట్..
తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం.