Movie News

డార్లింగ్ కలెక్షన్స్ దారుణం..నిర్మాతలకు పెద్ద బొక్కే

ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన డార్లింగ్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హనుమాన్ మూవీని నిర్మించిన నిర్మాతలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడం..అదే రేంజ్ లో ప్రమోషన్ చేయడం తో సినిమా చూసేందుకు ప్రేక్షకులు పోటీ పడ్డారు. కానీ సినిమా కథ పెద్దగా లేకపోవడం తో నిరాశకు గురయ్యారు. దీంతో మ్యాట్నీ షో నుండే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఈ చిత్రం తొలి రోజున 75 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక ఒవర్సీస్‌లో కూడా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేదనే టాక్ ట్రేడ్ వర్గాల్లో ఉంది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. అద్బుతమే జరగాలే అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది.

ఇక డార్లింగ్ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్‌ బిజినెస్ విషయానికి వస్తే.. ఆంధ్రా, నైజాం రాష్ట్రాల హక్కులను 5.5 కోట్ల రూపాయలకు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో హక్కులు 1.5 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్‌ హక్కులు 1 కోటి రూపాయల మేర బిజినెస్ జరిగింది.దాంతో ఈ సినిమా రైట్స్ వరల్డ్ వైడ్ 8 కోట్లకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ రిపోర్ట్.