Movie News

303 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఫస్ట్ తెలుగు రీజనల్ మూవీ

విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అపూర్వమైన విజయంతో తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒక గొప్ప రికార్డ్ సాధించింది. ఈ చిత్రం రీజనల్ సినిమా సరిహద్దులను రీడిఫైన్ చేసింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల వసూళ్లను దాటిన మొదటి తెలుగు రిజినల్ చిత్రంగా చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఇప్పటివరకు 303 కోట్ల వసూళ్ల సాధించింది.

వెంకటేష్ తన జనరేషన్ లో 300 కోట్ల వసూళ్లను సాధించిన ఫస్ట్ యాక్టర్ గా నిలిచారు. ఈ చిత్రం నాల్గవ వారంలోకి అడుగుపెట్టినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీస్ ఈ చిత్రాన్ని ఆదరించాయి, దీనిని బిగ్ స్క్రీన్స్ పై తప్పక చూడవలసిన చిత్రంగా మార్చాయి.

హిట్‌మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ హ్యుమర్ ఎమోషన్ తో కట్టిపడేసింది. ప్రేక్షకులను అలరించే కథలు రాయడంలో అనిల్ రావిపూడికి ఉన్న నైపుణ్యం మరోసారి ఆకట్టుకుంది,వెంకటేష్‌తో ఆయన కొలాబరేషన్ సినిమాటిక్ హెవెన్ లాంటి ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది.

ఈ సినిమా విజయం దాని బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే మరింత ఆకట్టుకుంటుంది, ఎందుకంటే ఇది తెలుగు సినిమా చరిత్రలో అత్యంత లాభదాయకమైన వెంచర్‌లలో ఒకటిగా నిలుస్తుంది, నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ కు గొప్ప రాబడిని తెచ్చింది. ఈ చిత్రం అనేక ప్రాంతాలలో పాన్-ఇండియా చిత్రాల కలెక్షన్లను కూడా అధిగమించింది.

ప్రస్తుత సవాలుతో కూడిన పరిస్థితుల్లో ప్రాంతీయ చిత్రంగా 300 కోట్ల మైలురాయిని చేరుకోవడం అసాధారణ విజయం.

దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మించిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.