Movie News

మార్చి 14న దయచేసి ‘కోర్ట్’ సినిమాకి వెళ్ళండి – నాని

ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ…ఇక్కడికి వచ్చిన మా డైరెక్టర్స్ కి థాంక్యూ సో మచ్. ఈ సినిమా గురించి ఒక విషయం బలంగా చెబుతున్నాను. 14న ఈ సినిమాని మీరు మిస్ అవ్వకండి. నా కెరియర్ లో ఎప్పుడూ కూడా దయచేసి సినిమా చూడండి అని అడగలేదు. కానీ ఈ సినిమా కడుగుతున్నాను. దయచేసి ఈ సినిమా చూడండి. 14న థియేటర్ కి వెళ్ళండి. ఇలాంటి మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని చెబుతున్నాను. మాకేదో సక్సెస్ రావాలని కాదు. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాని మిస్ కాకూడదని చెబుతున్నాను. మీ అందరిని బ్రతిమాలుతున్నాను. ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి. గొప్ప సినిమా చూశారానే ఫీలింగ్ తో వస్తారు.

యాక్టర్ ప్రియదర్శి మాట్లాడుతూ.. నాని అన్న థాంక్యూ సో మచ్. బలగం తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ సినిమా చేయమని చెప్పారు. మా టీమ్ అంతా ఇక్కడ ఉండడానికి  ముఖ్య కారణం నాని అన్న. ఈ సినిమాలలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ చాలా గొప్పగా చేశారు. ఇంతమంది దర్శకులు నాని అన్న కోసం ఈ సినిమా కోసం రావడం చాలా ఆనందంగా ఉంది. నేను నాని అన్న తమ్ముణ్ణి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. ఈ సినిమా 14న థియేటర్లో వస్తుంది. ఇది కూడా ఒక సూపర్ హీరో లాంటి కథ. కోటేసుకున్న ప్రతిసారి ఒక బ్యాట్మెన్ లో ఫీల్  అయ్యా. 14న థియేటర్లో కలుద్దాం. సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుందాం’అన్నారు.

డైరెక్టర్ రామ్ జగదీష్ మాట్లాడుతూ.. ఈ స్టేజ్ నాకు చాలా ప్రత్యేకం. నా జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా రైటింగ్ టీం డైరెక్షన్ టీం కి థాంక్యూ. వీళ్లంతా పేపర్ మీద సినిమా చూసిన మనుషులు. డీవోపీ దినేష్ లవ్ టుడే మహారాజా లాంటి 100 కోట్లు సినిమా తీసిన కెమెరామెన్. ఆయన మా కోర్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం లక్కీగా ఫీల్ అవుతున్నా. తన కెమెరాతో ఈ సినిమాకి జీవం పోశాడు. విజయ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. విటల్ గారు  సహజంగా కనిపించే సెట్స్ వేశారు. ప్రశాంతి గారు దీప్తి గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్.   ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రోషన్ శ్రీదేవి ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్. దర్శి అన్నకి బలగం ముందు ఈ కథ చెప్పాను.