Tuesday, December 24, 2024
Homeతెలుగు వార్తలుచిట్టి బాబు ఆడియో విడుదల

చిట్టి బాబు ఆడియో విడుదల

రాధికమ్మ సమర్పణలో ఎ కె 9 ఫిలిమ్స్ పతాకం పై సాయి జస్వంత్, రేణు వర్మ హీరో హీరోయిన్ లు గా అజయ్ కౌండిన్య రచన దర్శకత్వం లో పాతర్ల రామాంజనేయులు గురూజీ నిర్మిస్తున్న ప్రేమ కథ చిత్రం చిట్టి బాబు. అందమైన కథ కథనం తో రూపుదిద్దుకుంటున్న చిత్రం చిట్టి బాబు. షూటింగ్ అంతా పూర్తీ చేస్తుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీ గా ఉంది. చైతు అందించిన అందమైన బాణీలను ముఖ్య అతిధి గా విచ్చేసిన ప్రధాని రామకృష్ణ గౌడ్ చేతుల మీదగా మీడియా సమక్షంలో విడుదల చేసారు.

- Advertisement -

అనంతరం పాత్రికేయుల సమక్షంలో ప్రతాని రామకృష్ణ మాట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీ కి నిర్మాత చాలా ముఖ్యం, నిర్మాత ఉంటే కొత్త సినిమాలు, మంచి సినిమాలు వస్తాయి, ఎంతో మంది టెక్నిషన్స్ కి ఉపాధి లభిస్తుంది. పాతర్ల రామాంజనేయులు గారికి నా శుభాకాంక్షలు, వారు మరిన్నో మంచి మంచి సినిమాలు తీయాలి. దర్శకుడు అజయ్ కౌండిన్య కి సినిమా అంటే పిచ్చి. బ్రతికున్నంత కాలం ఇండస్ట్రీ లోనే ఉంటాను, సినిమాలు తీస్తాను అని చెప్పాడు. అంకిత భావం తో పని చేస్తాడు. త్వరలో స్టార్ డైరెక్టర్ అవుతాడు అనే నమ్మకం నాకుంది. చిట్టి బాబు సినిమా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం నాకుంది. తెలంగాణ ఫిలిం చాంబర్ తరపున అన్నివిధాలా సహాయం చేస్తాను. ఈ చిత్రం థియేటర్లు ద్వారా కానీ ఓ టి టి ద్వారా కానీ విడుదల కు అని విధాలా సహాయం చేస్తాను” అని తెలిపారు.

నిర్మాత పాతర్ల రామాంజనేయులు గురూజీ మాట్లాడుతూ “అజయ్ కౌండిన్య మంచి మిత్రుడు నా శిష్యుడు. 12 సంవత్సరాలు పరిచయం ఉంది. అప్పుడు కలిసి సినిమా చేదాం అనుకున్నాం కానీ ఆ కోరిక ఇప్పుడు తీరింది. మా అబ్బాయి సాయి జస్వంత్ ని హీరో గా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించాను. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం నాకుంది” అని తెలిపారు.

హీరో సాయి జస్వంత్ మాట్లాడుతూ “ఇది నా తొలి సినిమా. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా దర్శకుడు అజయ్ కౌండిన్య కి మరియు నిర్మాత పాతర్ల రామాంజనేయులు గురూజీ గారికి ధన్యవాదాలు” అని తెలిపారు.

హీరోయిన్ రేణు వర్మ మాట్లాడుతూ “హీరోయిన్ గా ఇది నా మొదటి సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అజయ్ కౌండిన్య కి మరియు నిర్మాత పాతర్ల రామాంజనేయులు గురూజీ గారికి నా ధన్యవాదాలు. నాకు తెలుగు రాకపోయినా యూనిట్ మొత్తం నాకు బాగా సపోర్ట్ చేసారు. అందరికి నా ధన్యవాదాలు” అని తెలిపారు.

కెమెరా మాన్ వాసు వర్మ మాట్లాడుతూ “నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అజయ్ కౌండిన్య కి మరియు నిర్మాత పాతర్ల రామాంజనేయులు గురూజీ గారికి నా ధన్యవాదాలు. కెరీర్ లో ఇది నా మూడో సినిమా, సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే విడుదలవుతుంది” అని తెలిపారు.

దర్శకుడు అజయ్ కౌండిన్య మాట్లాడుతూ “నేను గతంలో అనేక సందర్భాలలో ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని రకరకాల మాటలు అన్నాను వారిని నొపించాను కానీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు అవి అన్ని మనసులో పెట్టుకోకుండా నా సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి పిలవగానే కాదు అన్నకుండా వచ్చారు. వారికి నా ధన్యవాదాలు. థియేటర్స్ గురించి ఓ టి టి గురించి మాకు సపోర్ట్ చేస్తా అన్నారు, చాలా ధన్యవాదాలు. మా నిర్మాత పాతర్ల రామాంజనేయులు గురూజీ నాకు స్నేహితుడు, తండ్రి, గురూజీ. 12 సంవత్సరాల క్రితం ఇద్దరం కలిసి సినిమా చేయాలి కానీ అప్పుడు డబ్బులు లేవు. నాకు అయన అప్పుడే నాతో సినిమా చేస్తాను అని ప్రమాణం చేసారు. ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత నా సినిమా ని నిర్మించారు. వారికి నా ధన్యవాదాలు. వాళ్ల అబ్బాయి సాయి జస్వంత్ ని హీరో గా పరిచేయం చేస్తున్నాను. కేవలం 13 రోజులో సినిమా షూటింగ్ అంతా పూర్తిచేసాము. నన్ను అందరు వివాదాస్పద మనిషి, హింస పడతాడు అంటారు, కానీ అంత హింస పెట్టిన నాకు సహకరించి 13 రోజులు షూటింగ్ చేసిన నా టీం అందరికి నా ధన్యవాదాలు. చిట్టి బాబు సినిమా చాలా చిన్న బడ్జెట్ లో చేసాము, చిన్న సినిమా బ్రతకాలి అంటే మీడియా సపోర్ట్ ఉండాలి. దయ చేసి మా సినిమా కి మంచి పబ్లిసిటీ ఇవ్వండి మా సినిమా ని విజయవంతం చేయండి” అని కోరుకున్నారు.

రాధికమ్మ సమర్పించు
బ్యానర్ : ఎ కె 9 ఫిలిమ్స్
చితం పేరు : చిట్టిబాబు

నిర్మాత – పాతర్ల రామాంజనేయులు గురూజీ
పాటలు రచన, దర్శకత్వం – అజయ్ కౌండిన్య
మ్యూజిక్ – చైతు
కెమెరామెన్ – వాసువర్మ

కాస్ట్..
సాయి జస్వంత్. రేణు వర్మ, సంధ్య, విజయ్ కుమార్(లక్ష్మి స్ ఎన్టీఆర్ పెమ్), తదితరులు

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read