Movie News

చిరంజీవి నిర్ణయం ఫై అభిమానుల్లో ఆందోళన

మెగాస్టార్ చిరంజీవి తన వయసును సైతం లెక్క చేయకుండా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ప్ర‌స్తుతం ‘విశ్వంభ‌ర‌’ సినిమా చేస్తున్నారు. వ‌శిష్ట‌కు ద‌ర్శ‌కుడిగా ఇది రెండో సినిమా. అంత‌కు ముందు క‌ల్యాణ్ రామ్ తో ‘బింబిసార‌’తో హిట్ అందుకున్నాడు. అయినప్పటికీ డైరెక్టర్ ఫై నమ్మకంతో చిరు ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరోసారి మోహన్ రాజా తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభిమానుల్లో ఆందోళన పెంచుతుంది.

‘విశ్వంభ‌ర‌’ త‌ర‌వాత మోహ‌న్ రాజా తో సినిమా చేయబోతున్నారు చిరు. ఈ చిత్రానికి బీవీఎస్ ర‌వి క‌థ‌ని అందిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌థ‌పై క‌స‌ర‌త్తులు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. మోహ‌న్ రాజా చిరంజీవితో ఇది వ‌ర‌కు గాడ్ ఫాద‌ర్‌ తీశారు. ఆ సినిమా జ‌స్ట్ యావ‌రేజ్ అనిపించుకొంది. అందులోనూ రీమేక్‌. కాబ‌ట్టి మోహ‌న్ రాజాపై చిరు అభిమానుల‌కు పెద్ద‌గా న‌మ్మ‌కాలు కుద‌ర‌వు. చిరు కోసం ఈమ‌ధ్య చాలామంది ద‌ర్శ‌కులు క‌థ‌లు ప‌ట్టుకొని ఆయన చుట్టూ తిరుగుతున్నారు. మారుతి, హ‌రీష్ శంక‌ర్‌, అనుదీప్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు హ‌రి త‌దిత‌రులు ఉన్నారు. వీళ్ల‌లో ఏ ఒక్క‌రికి చిరు అవ‌కాశం ఇచ్చినా కాంబో ప‌రంగా క్రేజ్ వ‌చ్చేది. కానీ చిరు ఆ ప‌ని చేయ‌లేదు. బ‌హుశా.. బీవీఎస్ ర‌వి ఇచ్చిన క‌థ అంతగా న‌చ్చి ఉండొచ్చు. క‌థ బీవీఎస్ ర‌విది అయితే… దాన్ని ఏ హరీష్ శంక‌ర్ చేతిలో పెట్టినా హ్యాండిల్ చేసేవాడు. కాంబో ప‌రంగానూ సినిమాకు క‌ళ వచ్చేది. కానీ చిరు మాత్రం మోహన్ రాజా కు ఛాన్స్ ఇచ్చేసరికి అభిమానుల్లో ఆందోళన పెరగడమే కాదు టెన్షన్ పెడుతుంది. ఈ సినిమా ఏమవుతుందో అని..చూద్దాం రాజా ఏంచేస్థాడో..!!