Movie News

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి , రజనీకాంత్

ఏపీకి 4 వ సారి సీఎం గా చంద్రబాబు ప్రమా స్వీకారం చేయబోతున్నారు. అలాగే చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ , కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే కాదు చిత్రసీమ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు.

ఏపీ ప్రభుత్వం చాలా మంది సినిమా వాళ్లకు కూడా ఆహ్వానం పంపినట్టు టాలీవుడ్ సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కూడా ఉండటంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు ఫ్యామిలితో హాజరవుతున్నారు. నాగబాబు ఎలాగూ జనసేన తరపున వస్తున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా హాజరవుతున్నారు. నందమూరి ఫ్యామిలీ కూడా హాజరు కాబోతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, హీరో నిఖిల్, బోయపాటి శ్రీను, నిర్మాత అశ్వినిదత్.. మరింతమంది సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు గన్నవరం చేరుకున్నారు. రాజకీయ కార్యక్రమం అయినా చాలా మంది సినీ ప్రముఖులు వస్తుండటంతో ఈ కార్యక్రమం మరింత అటెన్షన్ తెచ్చుకుంది. ఆయా హీరోల అభిమానులు కూడా భారీగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.