Tuesday, December 3, 2024
HomeMovie Newsపుష్ప 2 వల్ల రష్మిక కు భారీ దెబ్బ

పుష్ప 2 వల్ల రష్మిక కు భారీ దెబ్బ

- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పుష్ప 2 మేనియా నడుస్తుంది. ఈ మూవీ విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడం తో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటీకే విడుదలైన సాంగ్స్, టీజర్స్ , ట్రైలర్ , ప్రమోషన్ కార్యక్రమాలు ఇలా ప్రతీది దేశ వ్యాప్తంగా ఆసక్తిని పెంచుతూ వెళ్తున్నాయి. 2021లో విడుదలైన పుష్ప – ది రైజ్ సినిమా నార్త్ ఇండియాలో కూడా మంచి వసూళ్లు సాధించడంతో, ‘పుష్ప 2’ పై అక్కడ అంచనాలు మరింత పెరిగాయి.

ఇంకా, ‘పుష్ప 2’ విడుదలతో పాటు, బీటౌన్‌లో ‘ఛావా’ అనే సినిమా కూడా విడుదలకానుంది. కానీ పుష్ప 2 కి ఏర్పడిన క్రేజ్ చూసి, ‘ఛావా’ టీమ్ తన విడుదల తేదీని మార్చింది. డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 14కి వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించబడింది. రష్మిక మాందన్నా ఈ రెండు సినిమాల్లోనూ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. పుష్ప 2 లో ఆమె శ్రీవల్లిగా, ‘ఛావా’లో ఆమె శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో నటిస్తోంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో, శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం కోసం విక్కీ కౌశల్ ప్రత్యేకంగా గుర్రపు స్వారీ మరియు కత్తిసామును నేర్చుకున్నారు. ఈ సినిమా ఫలితం రష్మిక ఎంతగానో ఎదురుచూస్తుంది. అయితే ఇప్పుడు పుష్ప 2 దెబ్బకు సినిమా రిలీజ్ వాయిదా పడడంతో ఆమె కాస్త డల్ అయ్యింది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read