Monday, December 23, 2024
HomeMovie Newsతండేల్ కోసం 9 నెలలు కష్టపడ్డాను - నాగ చైతన్య

తండేల్ కోసం 9 నెలలు కష్టపడ్డాను – నాగ చైతన్య

- Advertisement -

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య ప్రస్తతం తండేల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాయిపల్లవి హీరోయిన్​గా నటిస్తోంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని మొదట వేసవికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ అక్టోబర్​కు వాయిదా వేసినట్టు సమాచారం. ఇక ఈ మూవీ లో చైతు ఓ మ్యత్య్సకారుడి పాత్రలో కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోల్​ కోసం తాను తొమ్మిది నెలల పాటు కష్టపడ్టారంటూ చైతూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇదొక ఇన్​స్పిరేషనల్ స్టోరీ. శ్రీకాకుళం యాసతో పాటు సహా నా పాత్ర కోసం అవసరమైన ప్రతీదాన్ని నేను నేర్చుకున్నాను. నా కెరీర్‌లోనే ఇదొక భారీ చిత్రం అవుతుంది అన్నారు. ఇటీవలె ఈ మూవీ గ్లింప్స్​ను మేకర్స్ రివీల్ చేశారు. అందులో నాగ చైతన్య రగ్గ్‌డ్ లుక్​లో కనిపించగా, సాయి పల్లవి తన క్యూట్ లుక్స్​తో ఆకట్టుకున్నారు. బోటుపై చేపల వేటకు వెళ్తున్న చైతూ ‘దద్దా గుర్తెట్టుకో ఈ పాలి యాట గురి తప్పేదెలేదేస్. ఇక రాజులమ్మ జాతరే’ అంటూ చెప్పే డైలాగ్‌ అభిమానులను ఆకట్టుకుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read