Friday, October 18, 2024
HomeMovie Newsవైసీపీ అభ్యర్ధికి బన్నీ మద్దతు..మెగా ఫ్యాన్స్ఆగ్రహం

వైసీపీ అభ్యర్ధికి బన్నీ మద్దతు..మెగా ఫ్యాన్స్ఆగ్రహం

- Advertisement -

ఏపీలో ఎన్నికల హడావిడి ఏ రేంజ్ లో ఉందొ చెప్పాల్సిన పనిలేదు..ఈసారి కూటమే విజయం అన్నట్లు అంత భావిస్తున్నారు. చిత్రసీమ సైతం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ప్రకటన తో అంత సంతోషం వ్యక్తం చేసారు. కానీ ఇప్పుడు వైసీపీ అభ్యర్ధికి బన్నీ మద్దతు పలకడం ఫై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లనున్నారు. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తూ శిల్పా రవి నివాసంలో అల్పాహారం సేవించనున్నారు. దీంతో శిల్పా రవి ఇంటి వద్ద బన్నీ ప్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. నేడు ఎన్నికల ప్రచారం ముగింపు రోజు కావడంతో బన్ని రాక ప్రాధాన్యత సంతరించుకుంది. కళ్యాణ్ కు మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్.. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం ఏపీలో చర్చాంశనీయంగా మారింది. ఏపీ ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పవన్ పోరాడుతుంటే ఆయన కుటుంబం వ్యక్తే వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లనుండడంతో పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

శిల్పా రవిచంద్రారెడ్డి అల్లు అర్జున్ దంపతులు ఇద్దరికీ స్నేహితుడు. అందుకే ఆయనకు ఎన్నికల్లో సంఘిభావం చెప్పడానికి వెళ్తున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు అండగా మెగా ఫ్యామిలీ ఎంతగా పోరాడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో బన్నీ శిల్పా ఇంటికి వెళ్లడం పరోక్ష్యంగా వపన్ ను వ్యతిరేకించడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read