Movie News

తాతగా బ్రహ్మానందం.. మనవడిగా కొడుకు!

చిత్రసీమలోకి ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇచ్చినప్పటికీ..వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. బ్రహ్మానందం వారసుడు గౌతమ్ కూడా 2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘బసంతి’, ‘చారుశీల’, ‘మను’ లాంటి సినిమాలు చేశాడు. ఈ మూవీస్ ఏవీ ఆయనకు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందివ్వలేదు. అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తున్న గౌతమ్.. సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు.

ప్రస్తుతం ‘బ్రహ్మా ఆనందం’ మూవీ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్న చిత్రంలో ప్రియా వడ్లమాని హీరోయిన్ గా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాకు RVS నిఖిల్ తెరకెక్కించనుండగా.. రాహుల్ యాదవ్ నిర్మించనున్నారు. బ్రహ్మానందం తాత పాత్రలో కనిపించనున్న ఈ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. గ్రామీణ, పట్టణ సంస్కృతుల సమ్మేళనంతో అలరిస్తోంది. ఈ సినిమాలో తండ్రీకొడుకులు తాతామ‌న‌వ‌ళ్లుగా కనిపించబోతున్నారు. బ్ర‌హ్మ‌గా రాజా గౌత‌మ్‌, ఆనందంగా బ్ర‌హ్మానందం క‌నిపించ‌బోతున్నారు.