Monday, December 23, 2024
HomeMovie Newsప్రభాస్ 'రాజాసాబ్'లో రీమిక్స్ సాంగ్?

ప్రభాస్ ‘రాజాసాబ్’లో రీమిక్స్ సాంగ్?

- Advertisement -

ప్రభాస్ నటించిన . ‘కల్కి 2898 ఏడీ’ మూవీ భారీ విజయం సాధించడం తో ప్రభాస్ నుండి వస్తున్న నెక్స్ట్ మూవీ రాజాసాబ్’ పై అందర్నీ రెట్టింపు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ మారుతీ జాగ్రత్త పడుతున్నాడు. ప్ర‌భాస్ ని జోవియ‌ల్ గా చూసి కూడా చాలా కాల‌మైంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభాస్ చేస్తున్న తొలి హార‌ర్ సినిమా ఇది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఎదురు చూడ‌డానికి ఇలా స‌వాల‌క్ష కార‌ణాలు, కోణాలూ ఉన్నాయి. ఈ సినిమాని మ‌రింత స్పెష‌ల్ గా మార్చ‌డానికి మారుతి త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా ఓ సూప‌ర్ హిట్ గీతాన్ని రీమిక్స్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు టాక్‌.

1980ల్లో సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిన ఓ హిందీ పాట‌ని ఈ సినిమా కోసం వాడాల‌ని చూస్తున్నాడ‌ట‌. క‌థకు, స‌న్నివేశానికీ అనువుగా ఉండే పాట కోసం మారుతి అన్వేష‌ణ‌లో ప‌డ్డాడ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల చెన్నైలో సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా రీమిక్స్ గీతం గురించిన క‌స‌ర‌త్తు ప్రారంభ‌మైంద‌ని స‌మాచారం. ఈ పాట ఆల్బ‌మ్ మొత్తానికీ హైలెట్ గా, మంచి డాన్స్ నంబ‌ర్‌గా ఉండాల‌ని మారుతి భావిస్తున్నాడ‌ట‌. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ త్వరలోనే ఈ మూవీ షూటింగ్ సెట్స్లో తిరిగి జాయిన్ కానున్నట్లు సమాచారం.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read