Tuesday, December 24, 2024
HomeMovie Newsక్రాక్ డైరెక్టర్ కు బాలీవుడ్ ఆఫర్..

క్రాక్ డైరెక్టర్ కు బాలీవుడ్ ఆఫర్..

- Advertisement -

బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని. గత ఏడాది రవితేజ తో ఓ సినిమా ప్రకటించారు కానీ అనుకోని కారణాలతో అది రద్దయింది. ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది. గదర్2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన “సన్నీ డియోల్” తో గోపి సినిమా చేయబోతున్నాడు. కొన్ని రోజుల కిందే గోపీచంద్ బాలీవుడ్ లో సన్నీ డియోల్ కి కథ చెప్పాడని, సన్నీ వెంటనే ఓకే చేశాడని సమాచారం. ఇక అలా ఒకే చేయడమే లేటు. ఇటు సినిమాని అనౌన్స్ చేసేసారు. ఈ అప్డేట్ చూస్తున్న నెటిజన్లు గోపీచంద్ ని లక్ అంటే గోపిదే ఏకంగా బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేశాడని కితాబిస్తున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా నటించబోయే సినిమా #SDGM వర్కింగ్ టైటిల్ పేరిట నేడు అధికారికంగా పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ మెంట్ అయింది. ఇక మైత్రీ మూవీ మేకర్స్‌కి సంస్థ అధినేతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్, మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టిజి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించబోతున్నాడు. అయితే ఈ సినిమాను హిందీలో తెరకెక్కించినా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్లుగా సయామీ ఖేర్ మరియు రెజీనా కసాండ్రా నటించబోతున్నారట. అలాగే సాంకేతిక నిపుణుల వివరాలు కూడా తెలపడం జరిగింది. రిషి పంజాబీ కెమెరామెన్ గా వర్క్ చేయనుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

Excited to announce my next project with the Action Superstar @iamsunnydeol sir! Thrilled to be teaming up with @MusicThaman Bawa @RishiPunjabi5 sir, @NavinNooli brother and @artkolla for #SDGM ❤️

This venture is being produced by the amazing teams at @MythriOfficial &… pic.twitter.com/SKQnwJd6Yu— Gopichandh Malineni (@megopichand) June 20, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read