Friday, October 18, 2024
HomeMovie Newsవిమర్శలు ఎదుర్కుంటున్న నందమూరి బాలకృష్ణ

విమర్శలు ఎదుర్కుంటున్న నందమూరి బాలకృష్ణ

- Advertisement -

నందమూరి బాలకృష్ణ సినిమాల పరంగానే కాదు విమర్శల పరంగా కూడా వార్తల్లో నిలుస్తుంటారు.ముఖ్యంగా పబ్లిక్ ఫంక్షన్ లలో కానీ ఆడియో వేదికల్లో కానీ అభిమానులపై చేయి చేసుకున్న ఘటనలు ఈయన్ను విమర్శల పాలుచేస్తాయి. తాజాగా నటి అంజలి ని తోసేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. విశ్వ‌క్ సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari). ఈ సినిమా మే 31న ప్రేక్ష‌కులు ముందుకు రానుండ‌గా.. ఈ నెల 28న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.

ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన హీరో బాలకృష్ణ వేడుక‌లో భాగంగా న‌టి అంజ‌లిని నెట్టివేయడం ప‌లు వివాద‌ల‌కు దారి తీసింది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్ల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు బాల‌య్య‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సైతం బాలయ్య ఫై విమ‌ర్శ‌లు గుప్పించాడు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు హన్సల్ మెహతా బాల‌కృష్ణ అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించాడు. ఎవరు ఈ సభ్యత సంస్కారం లేని మనిషి అంటూ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టాడు. కాగా ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. మ‌రోవైపు ఇదే ఈవెంట్‌లో బాల‌య్య వాట‌ర్ బాటిల్‌లో మందు క‌లుపుకోని ఈవెంట్‌కు వ‌చ్చిన‌ట్లు కూడా వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

Who is this scumbag? https://t.co/KUVZjMZY2M— Hansal Mehta (@mehtahansal) May 29, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read