Movie News

‘బింబిసార’ ప్రీక్వెల్‌ ప్రకటన

కల్యాణ్​రామ్‌ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ బింబిసార ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ఈ సినిమా కు సంబంధించి పార్ట్‌2 రానుందని గతంలోనే ప్రకటించారు. అయితే నేడు కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రకటన చేశారు. మొదటి పార్ట్‌కు ప్రీక్వెల్‌గా రెండో భాగం రానున్నట్లు ప్రకటించారు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన వశిష్ఠ ..రెండో పార్ట్ నుండి తప్పుకోవడం తో ఆ బాధ్యతలు అనిల్ పాదూరి తీసుకున్నారు. ఈ పార్ట్ 2 కు సంబదించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతున్న మరోచిత్రం #NKR21 నుంచి కూడా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో రానుందీ చిత్రం. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆయన యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ హీరోయిన్. సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్​గా ఆమెకు సంబంధించి విడుదల చేసిన గ్లింప్స్​కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది.