Friday, October 18, 2024
HomeMovie Newsబిగ్ బాస్ 8 ప్రోమో వచ్చేసింది..

బిగ్ బాస్ 8 ప్రోమో వచ్చేసింది..

- Advertisement -

‘బిగ్ బాస్ 8’ ప్రోమో బయటికొచ్చింది. ఇందులో కంటెస్టెంట్స్ ఎవరు, ఎప్పటినుండి మొదలు లాంటి వివరాలు రివీల్ చేయకపోయినా ఎంటర్‌టైన్మెంట్ మాత్రం లిమిట్ లేకుండా ఉంటుందని నాగార్జున మాటిచ్చారు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ విజయవంతంగా రన్ అవుతున్న షో బిగ్ బాస్. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో ఈ షోకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. దాదాపు మూడు నెలలపాటు నడిచే ఈ రియాల్టీ షో గురించి నిత్యం ఏదోక న్యూస్ నెట్టింట వైరలవుతుంటుంది. ఇక ఇందులోకి ఎంటరయ్యే పోటీదారుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. హిందీలో ప్రస్తుతం బిగ్‏బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తుండగా.. త్వరలోనే తెలుగులో సీజన్ 8 స్టార్ట్ కానుంది.

ఈ క్రమంలో బిగ్ బాస్ 08 కు సంబదించిన ప్రోమో ను శుక్రవారం విడుదల చేసారు. కమెడియన్‌ సత్య పాత్రతో పరిచయమైన టీజర్‌లో నాగార్జున వ‌రాలు అందించే జీనీ పాత్ర‌లో కనిపించారు. ఈసారి మ‌రింత ఎంట‌ర్‌టైన్ అవ్వ‌బోతున్న‌ట్లు టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుండ‌గా.. ‘ఒక్కసారి కమిట్ ఐతే లిమిటే లేదు’ అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ ప్రేక్ష‌కుల‌ను అలరిస్తోంది. నాగార్జున గ‌త కొన్ని సీజ‌న్‌ల నుంచి తెలుగు బిగ్ బాస్‌కు హోస్ట్‌గా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక సీజన్ 8కు కూడా హోస్ట్‌గా నాగార్జున క‌నిపించ‌బోతున్నారు. అయితే ఈ సీజ‌న్ 8 డేట్ మాత్రం అనౌన్స్ చేయ‌లేదు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read