Movie News

ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ షాక్ ..

ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ షాక్ ఇచ్చారు కల్కి మేకర్స్. ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD) సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపించడం ఖాయమని అంత భావిస్తున్నారు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. జూన్ 27 పాన్ ఇండియా పలు భాషల్లో విడుదల కాబోతుండడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు జోరు పెంచారు.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో దీపికా పదుకొనేతో పాటు ప్రభాస్, అమితాబ్, రానా , కమల్ హాసన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇది ప్రభాస్ సినిమా కాబట్టి మామూలుగానే తెలుగు స్టేట్స్ లో అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకుంటారు. టాక్ తో సంబంధం లేకుండా భారీగా థియేటర్లకు జనాలు వస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఖచ్చితంగా నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఈ మధ్య అప్పుడప్పుడూ అది బ్రేక్ అవుతూ వస్తుంది. అయితే ప్రభాస్ నటిస్తున్న కల్కి టీమ్ నుండి అభిమానులకు ఊహించని వార్త వచ్చింది. కల్కి2898AD సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం లేదట. ఇతర భాషల్లో సినిమాని ప్రమోట్ చేయడానికి సమయం లేనందునా, తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేయడం లేదని సమాచారం.