కమల్‌హాసన్ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 మూవీ శుక్రవారం
భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కథ, స్క్రీన్ ప్లే , మ్యూజిక్ ఇలా ఏది కూడా ప్రేక్షకులను మెప్పించలేక ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ టాక్ సినిమా కలెక్షన్ల ఫై భారీగా పడింది. దీంతో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అని తెలుస్తుంది.
ఇండియన్ 2 సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలు. ఇండియన్ 2 కోసం 300 కోట్లు ఖర్చు పెట్టగా, ఇండియన్ 3 కోసం 200 కోట్లు ఖర్చుపెట్టారు అనే విషయం ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపుగా 600 కోట్ల గ్రాస్ కలెక్షన్ల టార్గెట్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో ఈ మూవీ 67 కోట్లకుపైగా నికరంగా, 78 కోట్ల గ్రాస్ వసూళ్లు, ఓవర్సీస్‌లో 52 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా గత 5 రోజుల్లో 130 కోట్ల రూపాయల గ్రాస్ నమోదు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా భారీగా వసూళ్లు రాబట్టాల్సిన అవసరం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీని బట్టి చూస్తే నిర్మాతలకు , డిస్ట్రబ్యూటర్స్ కు భారీ నష్టాలూ రావడం ఖాయం అంటున్నారు.