టైటానిక్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. వృద్ధ్యాప్య సమస్యల కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు, ఇతర సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
79 ఏళ్ల వయస్సున్న బెర్నార్డ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ట్రయాలజీ, ద టూ టవర్స్, రిటర్న్ ఆఫ్ ది కింగ్ సినిమాల్లో అద్భుతమైన నటన కనబరిచి 11 ఆస్కార్లు అందుకున్నారు. అయితే ఈ సినిమాలన్నింటి కన్నా ముందే ఆయన టైటానిక్తో మంచి పేరు సంపాదించుకున్నారు. 1912లో జరిగిన యథార్థ సంఘటనకు ప్రేమకథను జోడించి సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగేలా టైటానిక్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఈ సినిమాలో కెప్టెన్గా హుందాతనమైన క్యారెక్టర్ పోషించారు బెర్నార్జ్. ‘ప్రయాణికులను కాపాడలేని కెప్టెన్ ప్రాణాలతో బయటపడినా చనిపోయినట్లేనని’ అంటూ ట్రావెలర్స్ను కాపాడే పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.