Wednesday, December 25, 2024
Homeతెలుగు వార్తలువిజయ్ దేవరకొండకి 'మా' మద్దతు ఇస్తున్నాం.

విజయ్ దేవరకొండకి ‘మా’ మద్దతు ఇస్తున్నాం.

మంచి కార్యక్రమం చేస్తున్న ఆయనపై పలువురు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ ఇష్యూపై మాట్లాడదామని ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ లాక్ డౌన్ సమయంలో విజయ్ దేవరకొండ ఒక ఛారిటీని పెట్టి ఫండ్స్ ని పోగు చేసి తనవంతు సాయంగా పేదలకు ఆసరాగా నిలిచే ప్రయత్నం చేశారు. దాంతో పాటు మనకోసం సి.సి.సికి కూడా విరాళాన్ని ఇచ్చారు. చాలామంది అవసరమైన కూడా వారంతట వారు చేతులు చాచి ఎటువంటి సాయం అడగలేరు. వారికి అభిమానం అడ్డు వస్తుంది. అటువంటి వారందరూ విజయ్ దేవరకొండ ప్రారంభించిన ఈ ఛారిటీ ద్వారా ఆన్ లైన్ లో రిక్వెస్ట్ చేసి ఆ సాయాన్ని పొందవచ్చు అనే సదుద్దేశ్యంతో ఆయన దీనిని ప్రారంభించారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న ఆయనపై పలువురు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు.

వారిని నేను నిలదీస్తున్నా అసలు మీరు ఎవరు..మా ఆర్టిస్టులు మా ఇష్టం. ఎవరికి సాయం చేస్తాం..ఎవరికి ఎంత డొనేట్ చేస్తాం అనేది మా ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలపై ఎవరికి సమాధానం చెప్పాలి..ఎవరికి చెప్పకూడదనేది మా ఇష్టం అని బెనర్జీ తెలిపారు.

కొన్ని వెబ్ సైట్స్ చేస్తున్న కొంతమంది నిరాధార ఆరోపణలతో చాలా ఇబ్బందులకి గురి అవుతున్నాం. బయటికి రండి అని అనడం ఇదేం దొంగతనం కాదు..ఈ తప్పుడు వార్తలు రాసే వారికి ధైర్యం ఉంటే ముందు మీరు బయటికి వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడండి అని బెనర్జీ చెప్పారు. ముందు మీ ప్రొఫెల్ ని బయటపెట్టండి. ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండకి తాను మద్దతు ఇస్తున్నానని తెలిపారు. సినీ వెబ్ సైట్స్..ఫిల్మ్ జర్నలిస్టులకి సినీ పరిశ్రమకి ఇంటర్నెల్ లింక్ ఉందని..అందరూ అన్నదమ్ములం..తామంతా ఒక ఫ్యామిలీ అని పేర్కొన్నారు.

సినీ పరిశ్రమకి మీడియా వారి సపోర్ట్ తప్పకకావాలని దాన్ని మంచిగా ఉపయోగించాలని ఆయన అన్నారు. విజయ్ కి జరిగినట్టు మరెవ్వరికి జరిగినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని చెప్పారు. అందరం కలిసి మెలసి ఉందామని తెలియజేశారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read