Movie News

‘కిష్కింధపురి’ ఫస్ట్ లుక్ రిలీజ్

డిఫరెంట్ అండ్ వెరైటీ సబ్జెక్ట్స్ చేస్తున్న యాక్షన్ హల్క్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 11వ మూవీ #BSS11ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై చేస్తున్నారు. డైనమిక్, ప్యాషనేట్ నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్రిప్పింగ్ హర్రర్-మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోంది. 

మేకర్స్ ఇప్పుడు అఫీషియల్ గా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కిష్కింధపురి అనే టైటిల్ మిస్టరీని, మైథాలజీ గ్రాండియర్ ని సూచిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఎక్సయిటింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపిస్తున్నారు. 

చేతుల్లో జ్వాలలు పట్టుకుని, బెల్లంకొండ శ్రీనివాస్ , అనుపమ ఇద్దరూ అడవిలో ఏదో వెతుకుతున్నట్లు కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో ఒక బంగ్లా కనిపిండం థ్రిల్లింగ్ వైబ్ ని పెంచుతోంది. టైటిల్, పోస్టర్ రెండూ అంచనాలను పెంచడంలో విజయవంతమయ్యాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఏప్రిల్ 29న సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు.

టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, సంగీతం సామ్ సిఎస్ సమకూర్చారు. ప్రొడక్షన్ డిజైన్‌ను మనీషా ఎ దత్ నిర్వహిస్తున్నారు, డి. శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

నిరంజన్ దేవరమానే ఎడిటర్. ఈ ప్రాజెక్ట్ యొక్క క్రియేటివ్ హెడ్ జి. కనిష్క, సహ రచయిత దరాహాస్ పాలకొల్లు, స్క్రిప్ట్ అసోసియేట్ కె బాల గణేష్.