నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘ డాకు మహారాజ్ ‘. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ భామ ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ లో నటించింది. బాలయ్య – ఊర్వశి రౌతేలా మీద చిత్రీకరించిన ” దబిడి దిబిడి ” పాట ఇప్పుడు పెద్ద వివాదాన్ని సృష్టిస్తోంది. ఇంతకీ ఈ పాటలో వివాదాస్పద అంశం ఏంటో తెలుసా…..బాలయ్య ఊర్వశి రౌతేలా పిరుదుల మీద గట్టిగా కొట్టడం. అదేపనిగా గట్టిగా కొట్టడమే కాకుండా నాభి దగ్గర కూడా కొట్టే సన్నివేశం ట్రైలర్ లో కూడా వదిలారు చిత్ర యూనిట్. పాటలోనే కాకుండా మరో సన్నివేశంలో కూడా బాలయ్య ఊర్వశి రౌతేలా పిరుదులపై గట్టిగా బలంగా కొట్టే సన్నివేశం కూడా ఉండటం మరింత వివాదాన్ని రాజేస్తోంది.
ఇది కేవలం ట్రైలర్ , సాంగ్ లోనే ఇలా ఉంటే ఇక సినిమా మొత్తం మీద ఇలాంటి సన్నివేశాలు ఎన్ని ఉన్నాయో అనే అనుమానం నెలకొంది. ఈ సన్నివేశాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది. ఇక డాకు మహారాజ్ విడుదలై జనాల్లోకి మరింతగా చొచ్చుకెళ్లిన తర్వాత తప్పకుండా ఈ వివాదం మరింత పెద్దది అవుతుందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం సంగతి ఎలా ఉన్నపటికీ డాకు మహారాజ్ తో బాలయ్య సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.