నందమూరి మోక్షాజ్ఞ సినీ ఎంట్రీ కోసం గత కొంతకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇదిగో వస్తున్నాడు..అదిగో వస్తున్నాడు అని అనడమే తప్ప మోక్షాజ్ఞ ఎంట్రీ మాత్రం జరగడం లేదు. ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణ మోక్షాజ్ఞ ఎంట్రీ ఫై క్లారిటీ ఇచ్చాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమా మే 31న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ హైదరాబాద్‌లో మంగళవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు నందమూరి నటసింహం బాలకృష్ణ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. కాగా, ప్రోగ్రామ్‌లో బాలయ్య తన తనయుడు మోక్షాజ్ఞ సినిమా అరంగేట్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కుమారుడు నందమూరి మోక్షాజ్ఞ తెరంగేట్రం త్వరలోనే ఉండనుందని బాలయ్య క్లూ ఇచ్చారు.’మా అబ్బాయి మోక్షు కూడా రేపు ఇండస్ట్రీకి రావాలి. కానీ, నన్ను కాకుండా విశ్వక్, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువతరాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని తనకు చెబుకుంటా. నటులు నిత్యావసర వస్తువుల్లా ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్తదనం అందిస్తూ ఉండాలి. నాన్న నుంచి అదే నేర్చుకున్నా. మోక్షు కూడా అదే అనుసరిస్తాడు’ అని బాలయ్య తెలిపారు.